Keeda Cola Harikanth : సినిమా రిలీజ్‌కి ముందే టాలీవుడ్ యువనటుడు గుండెపోటుతో మృతి..
ఇటీవలే కీడా కోలా టీజర్ లో కనిపించిన యువనటుడు ఆ మూవీ రిలీజ్ కాకముందే తుదిశ్వాస విడిచాడు.
- gum 95921
- Published on- July 1, 2023 / 01:58 PM IST
Keeda Cola fame Harikanth passed away due to cardiac arrest
Keeda Cola Harikanth : ఈరోజు (జూన్ 1) టాలీవుడ్ ఒక విషాదకర వార్త వినాల్సి వచ్చింది. హరికాంత్ అనే ఒక యువనటుడు కెరీర్ మధ్యలోనే తుదిశ్వాస విడిచాడు. ఈ నటుడు ముఖ్య పాత్రలో కనిపిస్తూ చేసిన సినిమా నుంచి ఇటీవలే టీజర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. తరుణ్ భాస్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలు తరువాత చాలా గ్యాప్ తీసుకొన్న తరుణ్.. ఇప్పుడు కొత్త నటులతో ‘కీడా కోలా’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
Sreeleela : శ్రీలీల ప్లేస్ రష్మికకు వెళ్లిందా? శ్రీలీల గురించి నాగశౌర్య చెప్పిన సీక్రెట్..
ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో హరికాంత్ కూడా ఒకడు. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన హరికాంత్.. కీడా కోలాలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం అందుకున్నాడు. 33 ఏళ్ళ వయసు ఉన్న ఈ యువనటుడు ఈరోజు ఉదయం తన ఇంటిలోనే గుండెపోటుతో మరణించాడు. ఈ మరణ వార్త ప్రతి ఒకర్ని కలిచివేస్తుంది. తరుణ్ భాస్కర్ సినిమాలు ద్వారా చాలామంది యువనటులు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈక్రమంలోనే హరికాంత్ కెరీర్ కూడా మలుపు తిరుగుండేదేమో అంటూ నెటిజెన్స్ తమ సానుభూతుని తెలియజేస్తున్నారు.
కీడా కోలా చిత్ర యూనిట్ కూడా హరికాంత్ కి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా రెండు రోజులు క్రిందటే కీడా కోలా టీజర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలోని హరికాంత్ పాత్రకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఒక యువనటుడిని కోల్పోవడం టాలీవుడ్ కి తీరని లోటు.
