Keerthy Suresh : కీర్తి సురేష్ బర్త్ డే.. పెళ్లి తర్వాత మరింత బిజీగా..

కీర్తి సురేశ్‌ నేడు తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. (Keerthy Suresh)

  • Published on- October 17, 2026 / 06:43 PM IST

Keerthy Suresh

Keerthy Suresh : ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటుంది హోమ్లీ బ్యూటీ కీర్తి సురేశ్‌. కెరీర్‌ని పరుగులు పెట్టిస్తూనే తన ఇమేజ్‌ మార్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంది. సక్సెస్‌, ఫెయిలూర్స్‌తో సంబంధం లేకుండా స్పీడ్‌ చూపిస్తోన్న కీర్తి సురేశ్‌ నేడు తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

మహానటి సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్న కీర్తి సురేశ్‌ కెరీర్‌.. ఆ తర్వాత అనుకున్నంత రేంజ్‌లో కంటిన్యూ అవ్వలేదు. కీర్తి విమెన్‌ ఓరియెంటెండ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నటించిన సినిమాలు పెంగ్విన్, మిస్‌ ఇండియా, గుడ్‌లక్‌ సఖి, రఘు తాత బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌ అయ్యాయి. అలాగే మరికొన్ని ఓటీటీలో కూడా ఆకట్టుకోలేకపోయాయి. అయితే సక్సెస్‌ పరంగా వెనుకబడిన కీర్తి సురేశ్‌ ఇటీవలే కార్తిక్‌ సుబ్బరాజు డోరతీ సినిమాలో ప్లే చేసిన కీ రోల్‌కి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Also Read : Vijay Rashmika : విజయవాడ దుర్గమ్మ దర్శనంలో విజయ్, రష్మిక దంపతులు..

అలాంటి ఇంపార్టెంట్‌ రోల్స్‌తో పాటు ది ప్యారడైజ్‌లో ఏషనాగుల స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టిన కీర్తి ఒక్కసారిగా వైరల్ అయింది. త్వరలో కీర్తి అక్క వెబ్‌సిరీస్‌తో రానుంది. కీర్తి సురేశ్‌ బర్త్‌డే సందర్భంగా అక్క వెబ్‌సిరీస్‌ టీజర్‌ విడుదల చేసిన మేకర్స్ అక్టోబర్ 30 నుంచి ఈ వెబ్‌సిరీస్‌ని స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. యాక్షన్ ప్యాక్‌డ్‌గా, ఎగ్జైట్మెంట్‌ రైజ్‌ చేస్తోన్న అక్క వెబ్‌ సిరీస్‌లో కీర్తి సురేశ్‌తో పాటు ఇందులో రాధికా ఆప్టే కీ రోల్ ప్లే చేసింది. పవర్‌ఫుల్‌ టీజర్‌తో అక్క వెబ్‌సిరీస్‌పై క్యూరియాసిటీ పెరిగింది.

అక్క తర్వాత కీర్తి సురేశ్‌, మిస్కిన్‌ మెయిన్‌ లీడ్‌గా తెరకెక్కిన సత్యవాన్‌ సావిత్రి సినిమా నవబంర్ 20న ఆడియెన్స్‌ ముందుకొచ్చేందుకు రెడీ అయ్యింది. అదయ్యాక రౌడీ జనార్థన సినిమాతో ఆడియెన్స్‌ ముందుకు రావడానికి రెడీ అవుతుంది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ టైటిల్‌ రోల్‌ ప్లే చేస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also See : Sridevi : చీరలో కోర్ట్ ఫేమ్ ‘శ్రీదేవి’.. కొత్త సినిమా ప్రెస్ మీట్‌లో.. ఫొటోలు..

వీటన్నిటికంటే ముఖ్యంగా గ్యారెంటీ హిట్ కొట్టే అనిల్‌ రావిపూడి సినిమా చేస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన చేస్తున్న జనవరి 12 విడుదల సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజు కావడంతో జనవరి 12 విడుదల, రౌడీ జనార్దన సినిమాల నుంచి ఫస్ట్ పోస్టర్స్, అక్క నుంచి టీజర్ రిలీజ్ చేసారు. దీంతో పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అని తెలుస్తుంది.