Vijay Rashmika : విజయవాడ దుర్గమ్మ దర్శనంలో విజయ్, రష్మిక దంపతులు..
ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను విజయ్ దేవరకొండ, రష్మిక దర్శించుకున్నారు. (Vijay Rashmika)
Vijay Rashmika
Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి సినిమా ఇటీవల రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా సక్సెస్ అవ్వడంతో మూవీ టీమ్ మరిన్ని ప్రమోషన్స్ చేపట్టారు. ఈ క్రమంలో నేడు విజయ్, రష్మిక విజయవాడకు వెళ్లారు.
ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను విజయ్ దేవరకొండ, రష్మిక దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ జంట. పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించారు. విజయవాడ Mp కేశినేని చిన్ని దగ్గరుండి వీరిని దర్శనానికి తీసుకెళ్లారు.
Also See : Sridevi : చీరలో కోర్ట్ ఫేమ్ ‘శ్రీదేవి’.. కొత్త సినిమా ప్రెస్ మీట్లో.. ఫొటోలు..
దర్శనం అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా రణబాలిని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. Mp కేశినేని చిన్ని గారు మాకు మంచి ఆతిధ్యం ఇచ్చారు. విజయవాడ ఉత్సవ్ మంచి కార్యక్రమం. ఇది రెండవ సంవత్సరం. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడికి వచ్చాం. అందరికీ దసరా శుభాకాంక్షలు అని తెలిపారు.
దసరా సందర్భంగా విజయవాడలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ లో నేడు సాయంత్రం విజయ్ దేవరకొండ, రష్మిక పాల్గొననున్నారు.
