Sai Dharam Tej : అప్పుడు లావణ్య.. ఇప్పుడు కేతిక శర్మ.. సాయిధరమ్ తేజ్ హజ్బెండ్‌ మెటీరియల్‌ అంటూ..

సాయిధరమ్ తేజ్ హజ్బెండ్‌ మెటీరియల్‌ అంటూ టాలీవుడ్ హీరోయిన్స్ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు.

Ketika Sharma comments about Sai Dharam Tej gone viral

Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటారో అందరికి తెలుసు. ఈ విషయం ఇండస్ట్రీలోని చాలామంది సెలబ్రిటీస్ చాలా సందర్భాల్లో చెబుతుంటారు. కేవలం తన తోటి కళాకారులు, ఫ్యామిలీ మెంబెర్స్ తోనే కాదు, అభిమానులతో కూడా చాలా చనువుగా ప్రేమతో మాట్లాడుతుంటారు. ఈక్రమంలోనే సాయి ధరమ్ తేజ్ ని ప్రతి ఒక్కరు జడ్జ్ చేస్తూ కొన్ని ట్యాగ్స్ ఇస్తుంటారు.

ఈక్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్స్ అయితే సాయిధరమ్ తేజ్ హజ్బెండ్‌ మెటీరియల్‌ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ పని చేసిన లావణ్య త్రిపాఠి, కేతిక శర్మ.. ఈ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోకముందు లావణ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “వరుణ్ తేజ్ హజ్బెండ్‌ మెటీరియలే. కానీ, సాయిధరమ్ తేజ్ హజ్బెండ్‌ మెటీరియల్‌ కి పర్ఫెక్ట్” అంటూ కితాబు ఇచ్చారు.

Also read :Chiranjeevi : హనుమాన్ దర్శకుడితో చిరంజీవి సినిమా.. ‘సైరా’ ముందే రావాల్సింది.. కానీ..

ఇక తాజాగా ఓ తెలుగు షోలో పాల్గొన్న కేతిక శర్మని కూడా ఇదే ప్రశ్న వేశారు. మెగా బ్రదర్స్ సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్‌ ఇద్దరితో కలిసి కేతిక నటించారు. వీరిద్దరిలో ఎవరు హస్బెండ్ మెటీరియల్ అని ప్రశ్నించగా, కేతిక బదులిస్తూ.. “సాయి ధరమ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్. కానీ ఇద్దరు బ్రదర్స్ చాలా స్వీట్. వారిద్దరికీ నేను చాలా క్లోజ్. వైష్ణవ్, నేను చిన్నపిల్లలా కొట్టుకుంటుంటాము. తేజ్‌తో అయితే చాలా డీప్ విషయాలను కూడా మాట్లాడుతూ ఉంటాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా సాయి ధరమ్ తేజ్ తో పని చేసిన ప్రతి హీరోయిన్ హస్బెండ్ మెటీరియల్ అంటూ కితాబు ఇచ్చేస్తుండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తేజ్ సినిమాలు విషయానికి వస్తే.. దర్శకుడు సంపత్ నందితో ఓ మాస్ మూవీని చేస్తున్నారు. ఆ మధ్య టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఓ కాన్సెప్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమాకి ‘గంజా శంకర్’ అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.