ప్రముఖ తమిళ నటుడు జీవా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగం. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో..ఇప్పుడు ‘కీ’ అనే సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జీవా, నిక్కి గల్రాని, అనైక సోటి ప్రధాన పాత్రల్లో హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. కలీస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
సైబర్ నేరాల నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ సైకిలాజికల్ డ్రామాగా ‘కీ’ చిత్రాన్ని రూపొందించారు. ఎన్నాళ్లగానో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న జీవా ఈ చిత్రంతో గట్టి హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : నాకు బతకడమే ఓ కల : 28న ఐరా