KGF 2 : రికార్డులనేవి ఒక బాధ్యత.. ‘కెజిఎఫ్ 2’ హైదరాబాద్ ప్రెస్‌మీట్‌లో యశ్

ఈ ప్రెస్ మీట్ లో యశ్ మాట్లాడుతూ.. ''కెజిఎఫ్ అనేది నాకు బిగ్ జర్నీ. ఎంతో ఇంపార్టెంట్ జర్నీ. ఈ సినిమాతో మీకు కనెక్ట్ అయ్యాను, మీ గుండెల్లో స్థానం ఇచ్చారు. తెలుగు ఆడియన్స్........

KGF 2 : రికార్డులనేవి ఒక బాధ్యత.. ‘కెజిఎఫ్ 2’ హైదరాబాద్ ప్రెస్‌మీట్‌లో యశ్

Yash

Updated On : April 12, 2022 / 7:09 AM IST

Yash :  యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా వచ్చిన ‘కెజిఎఫ్’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హాంబల్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించారు. ‘కెజిఎఫ్’ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమ తలరాత మార్చిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు. ‘కెజిఎఫ్ 2’ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ అన్ని రాష్ట్రాల్లోనూ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.

పాన్ ఇండియా సినిమా ‘కెజిఎఫ్ 2’ సినిమాని తెలుగులో వారాహి చలన చిత్రం వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నిన్న రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు పలువురు కన్నడ, తెలుగు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో యశ్ మాట్లాడుతూ.. ”కెజిఎఫ్ అనేది నాకు బిగ్ జర్నీ. ఎంతో ఇంపార్టెంట్ జర్నీ. ఈ సినిమాతో మీకు కనెక్ట్ అయ్యాను, మీ గుండెల్లో స్థానం ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ సినిమాలని బాగా రిసీవ్ చేసుకుంటారు, తెలుగు ఆడియన్స్ అంటే నాకు ఇష్టం. మన ఇండస్ట్రీలో ఎక్కువ మంది హార్డ్ వర్క్ చేస్తారు. వండర్ఫుల్ టెక్నిషియన్స్ ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఒక మంచి సోల్ ఫుల్ సినిమా తీశాడు.”

BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్‌ నామినేషన్స్ లో ఎవరున్నారు??

”ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాము. ఇందులో ఉన్న మదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికి కనెక్ట్ అవుతుంది. మా సినిమాకు తెలుగు ఆడియన్స్ ఇస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాము. ఒక సినిమా క్రియేట్ చేసిన రికార్డులని ఇంకో సినిమా బద్దలు కొట్టాలి. అన్ని సినిమాలు రికార్డులు సృష్టించాలి. రికార్డ్స్ అనేవి ఒక భాధ్యత లాంటివి. మంచి హీరో అని కాదు ఇద్దరు హీరోలని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ మంచి ఆఫర్ తో వస్తే కచ్చితంగా మల్టీస్టారర్ చేస్తాను అని తెలిపారు.”