Khushbu Sundar : ఆమె కల తీర్చకుండానే మరణించిన భారతీరాజా.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ ట్వీట్..
సీనియర్ హీరోయిన్ కుష్బూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. (Khushbu Sundar)
- Saketh U
- Published on- June 10, 2026 / 11:23 AM IST
Khushbu Sundar
Khushbu Sundar : లెజెండరీ తమిళ దర్శకుడు భారతీరాజా మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ్, తెలుగు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు ఆయనతో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ కుష్బూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read : Chiranjeevi : భారతీరాజా చిరంజీవితో తీసిన ఒకేఒక్క సినిమా ఏంటో తెలుసా? ఆయన మరణంతో చిరు ఎమోషనల్ ట్వీట్..
కుష్బూ తన ట్వీట్ లో.. మనందరికీ ఇష్టమైన దర్శకుడు భారతీరాజా మన మధ్య లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచాయి. భవిష్యత్తులో రాబోయే సినిమాలకు ఆయన సినిమాలు ఓ నిఘంటువులా ఉంటాయి. ప్రతి సినిమా ప్రేమికుడి కోసం ఆయన గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు.
నన్ను రెండు జడలతో చూపిస్తూ ఒక సినిమా చేద్దామని ఆయన ఎప్పుడూ నాతో అనేవారు. ఆ కల ఇక తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Also Read : Bharathiraja-Rajinikanth : రజినీకాంత్ భారతీరాజా వివాదం.. రజనీని ఎంత చిన్నచూపు చూసారో తెలుసా..?
