Kiara – Sidharth : ‘కుచ్ కుచ్ హోతా హై’ లేకుండా కెమిస్ట్రీ ఎలా పండుతుందమ్మా!

రూమర్డ్ కపుల్ కియారా అద్వాణి - సిద్దార్థ్ మల్హోత్రా రొమాంటిక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది..

Kiara Advani Sidharth Malhotra

Kiara Advani – Sidharth Malhotra: పలానా హీరో, హీరోయిన్ సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నారట.. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారట, ఇంకేముంది.. రేపే, మాపో పెళ్లిపీటలు ఎక్కేస్తారు.. అబ్బే.. అలాంటిదేం లేదు, మేం మంచి ఫ్రెండ్స్ అంతే.. కలిసి రెండు, మూడు సినిమాలు చేస్తే రిలేషన్‌లో ఉన్నట్లేనా..? నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఇలాంటి వదంతులు వేలల్లో విన్నాం కానీ విన్న ప్రతిసారి ఏదో తెలియని కిక్కు అంటున్నారు గాసిప్ రాయుళ్లు..

 

బాలీవుడ్ యంగ్ కపుల్ కియారా అద్వాణి – సిద్దార్థ్ మల్హోత్రా రిలేషన్‌లో ఉన్నట్లు కొద్ది రోజులుగా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఇద్దరూ కలిసి హాలీడే ట్రిప్‌కి మాల్దీవులకెళ్లడం, ముంబై రోడ్ల మీద చెట్టాపట్టాలేసుకుని తిరగడం, కియారా పలుసార్లు సిద్దార్థ్ ఇంటికి వెళ్లడం వంటివి చేశారు కానీ ఇద్దరిలో ఎవ్వరూ కూడా తమ రిలేషన్ గురించి బయటకి చెప్పలేదు.
కట్ చేస్తే ఇప్పుడు ఈ రూమర్డ్ కపుల్ రొమాంటిక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Kiara Advani : కియారా కమిట్‌మెంట్.. శంకర్‌తో ఎన్ని సినిమాలంటే..

ఈమధ్య ‘షేర్షా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సిద్దార్థ్ షేర్ చేసిన ఈ వీడియోలో.. సిద్దార్థ్ – కియారా నటించిన లేటెస్ట్ మూవీ ‘షేర్షా’ లోని సాంగ్ బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతుండగా.. స్లో మోషన్‌లో నడుచుకుంటూ వచ్చి.. అలా కియారాను పట్టుకుంటాడు. కియారా కూడా ముసిముసి నవ్వులు నవ్వుతుంటుంది. ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ‘అచ్చు రియల్ లైఫ్ కపుల్‌లానే ఉన్నారు.. ఇద్దరి మధ్య ‘కుచ్ కుచ్ హోతా హై’ లేకుండా కెమిస్ట్రీ ఇంతలా ఎలా పండుతుందమ్మా..!.. క్యూట్ జోడీ’ అంటూ నెటిజన్లు కొంటెంగా కామెంట్స్ చేస్తున్నారు. హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ ‘ఓ మై టూ మచ్ క్యూట్‌నెస్’ అంటూ కామెంట్ చేసింది.