Kiara Advani : కియారా అద్వానీ బర్త్ డే.. సరికొత్త పోస్టర్‌తో ‘గేమ్ ఛేంజర్’ స్పెషల్ విషెస్..
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్.
- Thota Vamshi Kumar
- Updated on- July 31, 2024 / 10:36 AM IST
Kiara Advani birthday Game Changer movie unit special wishes
Kiara Advani birthday : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
కాగా.. నేడు (జూలై 31) కియారా అద్వానీ పుట్టిన రోజు. 33వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్బంగా గేమ్ ఛేంజర్ చిత్ర బృందం ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకి ఓ స్పెషల్ పోస్టర్‌తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ మూవీలో కియారా.. జాబిలమ్మ అనే రోల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
‘మా జాబిలమ్మ అలియాస్ కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ చిత్ర బృందం తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. త్వరలోనే ఆమె మీ అందరి హృదయాలను మంత్రముగ్ధులను చేయనుంది.’ అంటూ ట్వీట్ చేసింది.
శ్రీవేంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలీ, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్ర ఖనీ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఏడు పాటలు ఉంటాయని ఇటీవల తమన్ చెప్పాడు. త్వరలోనే ఓ పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Ram Charan – Suriya : రామ్ చరణ్ హీరోగా.. సూర్య విలన్ గా.. నిజం అయితే మాములుగా ఉండదుగా..
