Tauba Tauba : ‘తౌబా తౌబా’ పాట‌కు క్రికెట్ దిగ్గ‌జం ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ హుక్ స్టెప్పులు.. అస‌లు నిజం ఇదే..

బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశ‌ల్ న‌టించిన 'బ్యాడ్ న్యూజ్' చిత్రంలోని 'తౌబా తౌబా' పాట అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లు ఊగిస్తోంది.

Tauba Tauba : ‘తౌబా తౌబా’ పాట‌కు క్రికెట్ దిగ్గ‌జం ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ హుక్ స్టెప్పులు.. అస‌లు నిజం ఇదే..

Muttiah Muralitharan Tauba Tauba Steps The Truth Behind the Viral Video

Updated On : July 31, 2024 / 9:56 AM IST

Muttiah Muralitharan Tauba Tauba Steps : బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశ‌ల్ న‌టించిన ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రంలోని ‘తౌబా తౌబా’ పాట అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లు ఊగిస్తోంది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ కూడా ఈ పాట‌లోని హుక్ స్టెప్పుల‌తో రీల్స్ చేస్తున్నారు. తాజాగా శ్రీలంక దిగ్గ‌జ క్రికెటర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ కూడా తౌబా తౌబా పాట‌కు హుక్ స్టెప్పులు వేసిన‌ట్లుగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

దీన్ని చూసిన చాలా మంది స్పిన్ మాంత్రికుడు అయిన ముర‌ళీధ‌ర‌న్‌లో ఇంత‌టి డ్యాన్స్ ప్ర‌తిభ దాగి ఉందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దీంతో ముర‌ళీధ‌ర‌న్ డ్యాన్స్ వీడియో అంటూ స‌ద‌రు వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే.. ఆ వీడియోలో ఉంది క్రికెట‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ కాదు. ఆ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్య‌క్తి నిజానికి కిర‌ణ్ అనే ఓ కొరియోగ్రాఫ‌ర్.

Ram Charan – Suriya : రామ్ చరణ్ హీరోగా.. సూర్య విలన్ గా.. నిజం అయితే మాములుగా ఉండదుగా..

ముర‌ళీధ‌ర‌న్‌కు కిర‌ణ్ పోలీక‌లు కొంచెం ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో కొంద‌రు నెటిజ‌న్లు కాస్త గంద‌ర‌గోళానికి గురైయ్యారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కిర‌ణ్ డ్యాన్స్ వీడియో వైర‌ల్‌గా మార‌డంతో పాటు అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ్యాడ్ న్యూజ్ సినిమా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.12 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో 64 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇటీవల ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Revanth Reddy – Chiranjeevi : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. గద్దర్ అవార్డ్స్ గురించి ఏమన్నారంటే..