Ram Charan – Suriya : రామ్ చరణ్ హీరోగా.. సూర్య విలన్ గా.. నిజం అయితే మాములుగా ఉండదుగా..

తాజాగా గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ, తమిళ సూపర్‌స్టార్‌ సూర్య కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది.

Ram Charan – Suriya : రామ్ చరణ్ హీరోగా.. సూర్య విలన్ గా.. నిజం అయితే మాములుగా ఉండదుగా..

Ram Charan Suriya Planning Multi Starrer Movie Rumours goes Viral

Updated On : July 30, 2024 / 9:03 PM IST

Ram Charan – Suriya : RRR తర్వాత తెలుగులో మల్టీస్టారర్‌ సినిమాలకు మంచి క్రేజ్‌ పెరిగింది. గతంలో మల్టీస్టారర్‌ సినిమాలంటే ఆమడ దూరం ఉండే హీరోలు మారిన ట్రెండ్‌కు అనుగుణంగా ఇద్దరు ముగ్గురు హీరోలతో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరైతే ఏకంగా తమ స్టార్‌ డమ్‌ను పక్కనపెట్టి నెగిటివ్‌ రోల్స్‌ కూడా ఎంచుకుంటున్నారట.

తాజాగా గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ, తమిళ సూపర్‌స్టార్‌ సూర్య కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమాలో తమిళ స్టార్‌ హీరో సూర్య విలన్‌ చేయబోతున్నాడనేది తాజా గాసిప్‌. ఫిలంనగర్‌లో తెగ హల్‌చల్‌ చేస్తున్న ఈ ప్రచారంలో ఎంత నిజముందోగానీ, అదే జరిగితే సినిమా అదిరిపోతుందని ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్‌లో సూపర్‌ స్టార్‌ సూర్యకు తెలుగులోనూ లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన నెగిటివ్‌ రోల్‌లో నటిస్తారనే టాక్‌ హీట్‌ పుట్టిస్తోంది. గతంలో ట్వంటీ ఫోర్‌ అనే చిత్రంలో ద్విపాత్రిభినయం చేసిన సూర్య ఓ క్యారెక్టర్‌లో నెగిటివ్‌ పాత్ర పోషించారు. విక్రమ్ సినిమాలో కూడా చివర్లో రోలెక్స్ పాత్రలో నెగిటివిటీ చూపించారు. ఇక రామ్‌చరణ్‌తో సినిమాలో పూర్తిస్థాయి విలన్‌గా నటిస్తారనేది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read : People Media Factory : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ.. 100 సినిమాలు టార్గెట్ గా..

ప్రస్తుతం రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, సూర్య కంగువ సినిమాలో నటిస్తున్నారు. ఇది కూడా దాదాపు 14 భాషల్లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నారంటూ కొద్దికాలం నుంచి వార్తలు వస్తున్నాయి కానీ, అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. ఇదే సమయంలో సూర్య విలన్‌ అంటూ జరుగుతున్న ప్రచారం మరింత హీట్‌ పెంచుతోంది. రామ్‌చరణ్‌ త్వరలో బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది. ఇది పాన్ ఇండియా సినిమా. ఇందులో చరణ్‌తో సూర్య ఫైట్ చెయ్యబోతున్నాడనే ప్రచారం. విలన్ అంటే ఇలా ఉంటారా? అనే విధంగా సూర్య క్యారెక్టర్ ఉండబోతుందంటున్నారు. పూర్తిగా పుల్ లెంగ్త్‌ విలన్ పాత్రలో సూర్య కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఈ న్యూస్ నిజమైతే మాత్రం చరణ్, సూర్య మధ్య ఫైట్ స్క్రీన్ పై అదిరిపోవాల్సిందేనంటున్నారు ఫ్యాన్స్‌. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.