People Media Factory : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ.. 100 సినిమాలు టార్గెట్ గా..

భారీ బడ్జెట్ తో పాటలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

People Media Factory : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ.. 100 సినిమాలు టార్గెట్ గా..

People Media Factory Producing back to back Movies coming with Mr Bachchan

Updated On : July 30, 2024 / 8:47 PM IST

People Media Factory : ఇటీవల టాలీవుడ్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ దూసుకుపోతుంది. కార్తికేయ 2, ధమాకా, బ్రో.. లాంటి 100 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమాలని అందించిన ఈ నిర్మాణ సంస్థ వరుసగా సినిమాలను లైన్లో పెడుతుంది. సినిమాలే కాకుండా ఓటీటీ, టీవీ, యూట్యూబ్ లో కూడా పలు షోలు నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో పాటలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇటీవలే శర్వానంద్ మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిర్మాణ సంస్థ ఇప్పుడు రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో రాబోతుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG విశ్వప్రసాద్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, టీజర్ రిలీజయి మంచి అంచనాలు నెలకొన్నాయి. తక్కువ షూటింగ్ డేస్ లో గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ లో ఈ సినిమాని తెరకెక్కించారు.

Also Read : Revanth Reddy – Chiranjeevi : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. గద్దర్ అవార్డ్స్ గురించి ఏమన్నారంటే..

మిస్టర్ బచ్చన్ తర్వాత మరిన్ని సినిమాలు వరుసగా రానున్నాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి. ప్రభాస్ – మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాని వీళ్ళే నిర్మిస్తున్నారు. తాజాగా నిన్నే రాజాసాబ్ గ్లింప్స్ వచ్చి సందడి చేసింది. 100 సినిమాలు టార్గెట్ పెట్టుకొని శరవేగంగా సినిమాలు చేస్తున్నారు నిర్మాత విశ్వ ప్రసాద్. ఇప్పటికే దాదాపు 25 సినిమాలు రిలీజవ్వగా మరో 10 వరకు షూటింగ్స్ లో ఉన్నాయి. ఇంకా కథలు కూడా వింటున్నారు. కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. రాజాసాబ్, గూఢచారి 2, తేజ సజ్జతో మిరాయ్, గోపీచంద్ విశ్వం, సన్నీ డియోల్ గోపీచంద్ మలినేని సినిమా, బెంగాలీ మా కాళీ సినిమా.. ఇలా అనేక సినిమాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్నాయి. ఇక నిర్మాత విశ్వప్రసాద్ జనసేనకు., పవన్ కళ్యాణ్ కు ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. జనసేన గెలిచాక టాలీవుడ్ తరపున సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు.