Kiara Advani buys new var worth 3 crores news goes viral
Kiara Advani New Car : బాలీవుడ్(Bollywood) భామ కియారా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra)ని ప్రేమించి ఇటీవల ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. జైసల్మీర్ లో వీరి పెళ్లి గ్రాండ్ గా జరగగా వీరి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత కూడా కియారా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్(Ram Charan) సరసన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాలో కూడా నటిస్తోంది కియారా. తాజాగా కియారా కు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది
కియారా అద్వానీ ఇటీవలే ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుని కొన్నట్టు సమాచారం. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ S క్లాస్ మోడల్ కారును కొనుగోలు చేసింది కియారా. ఈ కారు ధర 3 కోట్ల 40 లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కారు ధర తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు అంతా. ఏకంగా కియారా మూడు కోట్లకు పైగా పెట్టి కారు కొందా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మే 26నే కార్ రిజిస్ట్రేషన్ కూడా అయిందని ముంబై RTO ఆఫీస్ నుంచి సమాచారం.
Katrina Kaif : విక్కీ కౌశల్ పక్కన కత్రినా భార్యగా సెట్ అవ్వదు.. వైరల్ అవుతున్న డైరెక్టర్ కామెంట్స్..
తాజాగా ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి తన కొత్త కారులో వచ్చింది కియారా అద్వానీ. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఏకంగా 3 కోట్లు పెట్టి కార్ కొన్నారా అని కొంతమంది ఆశ్చర్యపోతుంటే పలువురు మాత్రం కియారాకు కంగ్రాట్స్ చెప్తున్నారు.