Katrina Kaif : విక్కీ కౌశల్ పక్కన కత్రినా భార్యగా సెట్ అవ్వదు.. వైరల్ అవుతున్న డైరెక్టర్ కామెంట్స్..

విక్కీ కౌశల్ అప్ కమింగ్ మూవీ 'జరహట్ కే జరబచ్ కే' జూన్ 2న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో విక్కీకి జంటగా సారా అలీఖాన్ నటిస్తోంది. టిపికల్ మిడిల్ క్లాస్ భార్యాభర్తల మధ్య ఎంటర్టైన్మెంట్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కింది.

Katrina Kaif : విక్కీ కౌశల్ పక్కన కత్రినా భార్యగా సెట్ అవ్వదు.. వైరల్ అవుతున్న డైరెక్టర్ కామెంట్స్..

Katrina Kaif is not set for Vicky Kaushal wife character in that movie director comments goes viral

Updated On : May 31, 2023 / 10:11 AM IST

Vicky Kaushal : హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినిమా మేకర్స్ కి ఫుల్ హ్యాపీ. ఇద్దర్నీ జంటగా పెట్టి సినిమా చేస్తే ఆ సినిమాకుండే క్రేజ్, మార్కెట్ వేరు. కానీ ఇలా జంటగా నటించడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు కొంతమంది సెలబ్రిటీ కపుల్. అయితే అలాంటి అవకాశం విక్కీ కౌశల్ ఇచ్చినా డైరెక్టర్ మాత్రం వద్దన్నాడు. విక్కీ కౌశల్ అప్ కమింగ్ మూవీ ‘జరహట్ కే జరబచ్ కే’ జూన్ 2న రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈ సినిమాలో విక్కీకి జంటగా సారా అలీఖాన్ నటిస్తోంది. టిపికల్ మిడిల్ క్లాస్ భార్యాభర్తల మధ్య ఎంటర్టైన్మెంట్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ఎలాగూ విక్కీ కౌశల్, హీరోయిన్ భార్యాభర్తల్లా నటించాలి కదా అలాంటప్పుడు విక్కీకి జంటగా తన భార్య కత్రినాని తీసుకుంటే సరిపోయేది కదా అని విలేఖరి అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకార్ ఇచ్చిన ఆన్సర్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.

Sarath kumar : నన్ను సీఎం చేస్తే 150 ఏళ్ళు బతికే సీక్రెట్ చెప్తా.. నటుడు శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

‘జరహట్ కే జరబచ్ కే’ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకార్ ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ.. కత్రినా కైఫ్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకనే చాన్సే లేదు. ఫారెన్ రిటర్న్ అయిన కత్రినా కైఫ్ ఎక్కడైనా ఇండియన్ మిడిల్ క్లాస్ భార్యగా కనిపిస్తుందా? అసలు క్రతినాని చూస్తే మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తుందా? అందుకే ఈ సినిమాలో విక్కీ పక్కన కత్రినా కైఫ్ భార్యగా సరిపోదు. పర్సనల్ గా వారిద్దరూ బ్యూటిఫుల్ కపుల్ అయినా ఈ సినిమా కథలో మాత్రం భార్య భర్తల్లా సెట్ అవ్వరు. ఈ సినిమాకి టిపికల్ మిడిల్ క్లాస్ లుక్ ఉన్న అమ్మాయి కావాలని సారా అలీఖాన్ ని సెలక్ట్ చేసుకున్నాను అని తెలిపారు. దీంతో ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.