Kichcha Sudeep : అబద్దపు ఆరోపణలు అంటూ.. ఆ నిర్మాతపై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కిచ్చ సుదీప్..

MN కుమార్ అనే నిర్మాత కిచ్చ సుదీప్ కి ఒక సినిమా కోసం ఎనిమిదేళ్ల క్రితమే అడ్వాన్స్ ఇచ్చాను అని, సినిమాకి ఓకే చెప్పి ఇప్పటివరకు డేట్స్ ఇవ్వట్లేదని ఆరోపణలు చేశాడు.

Kichcha Sudeep files Defamation case on Producer and fires on his allegations

Kichcha Sudeep  :  కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఈగ నుంచి పలు సినిమాలతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. ప్రస్తుతం కన్నడలో వరుసగా భారీ సినిమాలు చేస్తున్నాడు. కిచ్చ సుదీప్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే తన 46వ సినిమాని కూడా ప్రకటించాడు. అయితే గత వారం రోజులుగా కిచ్చ సుదీప్ పేరు వార్తల్లో వినిపిస్తుంది.

MN కుమార్ అనే నిర్మాత కిచ్చ సుదీప్ కి ఒక సినిమా కోసం ఎనిమిదేళ్ల క్రితమే అడ్వాన్స్ ఇచ్చాను అని, సినిమాకి ఓకే చెప్పి ఇప్పటివరకు డేట్స్ ఇవ్వట్లేదని ఆరోపణలు చేశాడు. విక్రాంత్ రానా సినిమా తర్వాత నాకే డేట్స్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు వేరే సినిమా చేసుకుంటున్నాడని, అతని దగ్గరికి వెళదామని ట్రై చేసినా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, ఆల్రెడీ డైరెక్టర్, కథ అన్ని ఫైనల్ అయ్యాయని, ఒక టైటిల్ కూడా సినిమా కోసం రిజిస్టర్ చేయించామని ఆరోపణలు చేశారు. నిర్మాతల మండలిలో కూడా కంప్లైంట్ చేశారు.

Director Mahi V Raghav : యాత్ర 2 వాళ్ళ కోసమే తీస్తున్నాం అనుకున్నా పర్లేదు.. ఏపీ ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు..

తాజాగా నిర్మాత MN కుమార్ ఆరోపణలపై కిచ్చ సుదీప్ ఫైర్ అయి అతనిపై 10 కోట్లకు పరువునష్టం దావా కేసు వేశాడు. అంతే కాకుండా తనపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. మరి ఈ కేసు ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.