Rajinikanth – Nagarjuna : రజినీకాంత్ సినిమాలో నాగార్జున.. కింగ్ పుట్టిన రోజు గిఫ్ట్ ‘సైమన్’..

నేడు మన కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో నాగార్జున నటించబోతున్నట్టు తెలిపి పోస్టర్ రిలీజ్ చేసారు.

King Akkineni Nagarjuna Birthday Poster Released From Rajinikanth Coolie Movie

Rajinikanth – Nagarjuna : రజినీకాంత్ త్వరలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ 171వ సినిమాగా ఇది రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. గతంలో ఈ సినిమాలో నాగార్జున కూడా నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అవి నిజమన్నట్టు క్లారిటీ ఇచ్చేసారు మూవీ యూనిట్.

Also Read : Constable : వరుణ్ సందేశ్ వరుస సినిమాలతో వస్తున్నాడుగా.. ‘కానిస్టేబుల్’ మోషన్ పోస్టర్ రిలీజ్..

నేడు మన కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో నాగార్జున నటించబోతున్నట్టు తెలిపి పోస్టర్ రిలీజ్ చేసారు. కూలీ సినిమాలో నాగార్జున సైమన్ అనే పాత్ర చేయబోతున్నాడు. నాగార్జునకు బర్త్ డే విషెష్ చెప్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో నాగార్జున స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని కూర్చొని చేతిలో వాచ్ పెట్టుకొని ఉన్నాడు. ఈ లుక్ లో నాగ్ సరికొత్తగా ఉన్నాడు.

దీంతో ఈ సినిమాపై మన టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమాలో లోకేష్ నాగార్జునని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు