Kiran Abbavaram : స్కూల్ లవ్ స్టోరీ రివీల్ చేసిన ఫ్రెండ్.. ఫైర్ అయిన కిరణ్ అబ్బవరం..

కిరణ్ అబ్బవరం నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లతో ముచ్చటించాడు.

Kiran Abbavaram fires on A Netizen who Revealed his School Love Story

Kiran Abbavaram : హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘క’ అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లతో ముచ్చటించాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

Also Read : Kiran Abbavaram : మా ఆవిడ ఒప్పుకుంటే అలాంటి సినిమా చేస్తా.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

ఓ నెటిజన్.. నేను కూడా నీ క్లాస్ మేట్ అన్న. నువ్వు స్కూల్ లో దివ్యకు లైన్ వెయ్యడం ప్రిన్సిపాల్ మేడంకు చెప్పింది నేనే.. అంటూ కిరణ్ అబ్బవరం స్కూల్ లవ్ స్టోరీ రివీల్ చేసేసాడు. దీంతో కిరణ్ అబ్బవరం స్పందిస్తూ.. నువ్వే చెప్పింది అని అప్పుడే తెలిసి ఉండాల్సింది అంటూ కోపంతో ఉండే ఎమోజి పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక కిరణ్ ఇటీవలే ఆల్రెడీ తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 

అలాగే శరణ్య అనే మరో నెటిజన్.. కొంచెం స్కూల్ ఫ్రెండ్స్ ని గుర్తుంచుకో. ఆల్ ది బెస్ట్ సినిమాకు అంటూ ట్వీట్ చేసింది. దీనికి కిరణ్ సమాధానమిస్తూ.. హాయ్ శరణ్య, నువ్వు ఇంకా మారలేదు అలాగే కోప్పడుతున్నావు. త్వరలో అందరం కలుద్దాం అంటూ ట్వీట్ చేసాడు. ఇలా కిరణ్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చాడు.