Kiran – Rahasya : హైదరాబాద్ లో కిరణ్ అబ్బవరం – రహస్య గోరఖ్ స్పెషల్ వెడ్డింగ్ పార్టీ..

ఇప్పటికే కిరణ్ - రహస్య పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు వైరల్ గా మారగా అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

Kiran Abbavaram Rahasya Gorak Special Wedding Party in Hyderabad

Kiran – Rahasya : యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ఆగస్టు 22న నటి రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి ప్రేమించుకున్న ఈ జంట పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. కిరణ్ – రహస్య పెళ్లి కర్ణాటక లోని కూర్గ్ లో జరిగింది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం – రహస్య రిసెప్షన్ వేడుకలు కిరణ్ సొంతూరు రాయచోటిలోని పెద కోడివాండ్ల పల్లిలో ఓ మామిడి తోటలో చెట్ల కింద గ్రాండ్ గా నిర్వహించారు.

పెళ్ళికి కేవలం బంధుమిత్రులని మాత్రమే పిలవగా కిరణ్ సొంతూళ్లో జరిగిన రిసెప్షన్ వేడుకకు ఊళ్ళో వాళ్ళందర్నీ పిలిచి భోజనాలు పెట్టారు. ఇప్పుడు కిరణ్ – రహస్య హైదరాబాద్ లో స్పెషల్ వెడ్డింగ్ పార్టీ నిర్వహించబోతున్నారు. రేపు ఆగస్టు 30న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాల్ లో కిరణ్ – రహస్య సినీ ప్రముఖులకు, సినీ మీడియాకు స్పెషల్ గా వెడ్డింగ్ పార్టీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Also Read : Bigg Boss 8 Contestants : మరో మూడు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మొదలు.. ఈసారి హౌస్ లోకి వెళ్ళేది వీళ్ళే అంట..

ఇప్పటికే కిరణ్ – రహస్య పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు వైరల్ గా మారగా అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు