Bigg Boss 8 Contestants : మరో మూడు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మొదలు.. ఈసారి హౌస్ లోకి వెళ్ళేది వీళ్ళే అంట..

ఫైనల్ లిస్ట్ లో వీరిలో ఎంతమంది ఉంటారో చూడాలి మరి.

Bigg Boss 8 Contestants : మరో మూడు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మొదలు.. ఈసారి హౌస్ లోకి వెళ్ళేది వీళ్ళే అంట..

Bigg Boss Telugu Season 8 Contestants List Rumours goes Viral

Updated On : August 31, 2024 / 3:09 PM IST

Bigg Boss 8 Contestants : బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 8 మరో మూడు రోజుల్లో మొదలు కాబోతుంది. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8వ సీజన్ తో రానుంది. నాగార్జునే హోస్ట్ గా ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమోని కూడా రిలిజ్ చేసారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ తో మొదలు అవ్వనుంది. ఆ రోజే హౌస్ లోకి ఎవరెవరు కంటెంటెంట్స్ వెళ్తారో తెలుస్తుంది.

ఆ తర్వాత సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ప్రతి రోజు రాత్రి 9.30 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు బిగ్ బాస్ షో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఇప్పట్నుంచే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ షోలోకి ఎవరెవరు వెళతారు అని కొన్ని పేర్లు టాలీవుడ్ లో బాగా అవినిపిస్తున్నాయి.

Also Read : Swag Teaser : శ్రీవిష్ణు ‘స్వాగ్’ టీజర్ రిలీజ్.. భూత భవిష్యత్ వర్తమాన పాత్రలతో అదరగొట్టారుగా..

బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చే కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

సీరియల్స్, టీవీ షోలు, యాంకరింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి,
యాంకర్ విష్ణుప్రియ,
సోషల్ మీడియా ఫేమస్ ఫుడ్ పాయింట్ కుమారి ఆంటీ,
ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్న నటుడు ఆదిత్య ఓం
సీరియల్ నటి యాష్మి గౌడ
సీరియల్ నటుడు నిఖిల్
యాంకర్, కమెడియన్ బెజవాడ బేబక్క అలియాస్ సింగర్ మధూ
నటుడు అభయ్ నవీన్
అలీ తమ్ముడు ఖయ్యుమ్
ఆర్జే శేఖర్ భాష
నటి సహర్ కృష్ణన్
ఢీ డ్యాన్సర్ నైనికా
నటి సోనియా ఆకుల
జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు
నటి రేఖ భోజ్
ఓ సెలబ్రిటీ కపుల్ ఉన్నారని పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే ఫైనల్ లిస్ట్ లో వీరిలో ఎంతమంది ఉంటారో చూడాలి మరి. ఈసారి ఎవరు సెలబ్రిటీలుగా వస్తారో, ఎవరు స్టార్ డమ్ పెంచుకుంటారో, ఎవరు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అవుతారో చూడాలి.