Swag Teaser : శ్రీవిష్ణు ‘స్వాగ్’ టీజర్ రిలీజ్.. భూత భవిష్యత్ వర్తమాన పాత్రలతో అదరగొట్టారుగా..

శ్రీవిష్ణుతో రాజ రాజ చోర సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో ‘స్వాగ్’ అనే సినిమా తెరకెక్కుతుంది.

Swag Teaser : శ్రీవిష్ణు ‘స్వాగ్’ టీజర్ రిలీజ్.. భూత భవిష్యత్ వర్తమాన పాత్రలతో అదరగొట్టారుగా..

Sree Vishnu Ritu Varma Swag Movie Teaser Released

Updated On : August 29, 2024 / 5:42 PM IST

Swag Teaser : హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ కామెడీ హిట్స్ కొట్టిన శ్రీవిష్ణు ఇప్పుడు మరో కామెడీ సినిమాతో రాబోతున్నాడు. గతంలో శ్రీవిష్ణుతో రాజ రాజ చోర సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో ‘స్వాగ్’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా తాజాగా స్వాగ్ టీజర్ రిలీజ్ చేసారు.

Also Read : Rajinikanth – Nagarjuna : రజినీకాంత్ సినిమాలో నాగార్జున.. కింగ్ పుట్టిన రోజు గిఫ్ట్ ‘సైమన్’..

ఈ టీజర్ చూస్తుంటే రాజుల కాలం, ప్రస్తుతం, భవిష్యత్తులో మగ, ఆడ గొప్ప అనుకునే రెండు వంశాల మధ్య జరిగే యుద్ధంలాగా కనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్వాగ్ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా స్వాగ్ టీజర్ చూసేయండి..

ఇక ఈ సినిమాలో రీతువర్మ, మీరాజాస్మిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో శ్రీవిష్ణు నాలుగు రకాల పాత్రలతో మెప్పించబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీవిష్ణుతో పాటు రీతువర్మ కూడా కాలానికి తగ్గట్టు పాత్రలు వేసినట్టు తెలుస్తుంది. దీంతో శ్రీవిష్ణు మరో మంచి కామెడీ సినిమాని తీసుకురాబోతున్నాడు.