Kishkindhapuri : బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి ప్రీమియర్స్ టాక్.. బాబు ఖాతాలో హిట్..

నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో కిష్కింధపురి ప్రీమియర్ షో వేశారు. (Kishkindhapuri)

Kishkindhapuri

Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘కిష్కింధపురి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కిష్కింధపురి రేపు సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుండగా నైన్ కొంతమంది మీమర్స్ కి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కి ప్రీమియర్స్ వేశారు.(Kishkindhapuri)

ఈ ప్రీమియర్స్ టాక్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో కిష్కింధపురి ప్రీమియర్ షో వేశారు. సినిమా మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్నా తర్వాత కథ వేగంగా పరిగెడుతుంది. కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగు పెట్టాక అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ, భయపెట్టేసాడట. ఫస్టాఫ్ సింపుల్ గా అక్కడక్కడా భయపెడుతూ అనుకున్న పాయింట్ ని చెప్పారట.

Also See : బాలీవుడ్ షోలో మిరాయ్ మూవీ టీమ్ సందడి.. కపిల్ శర్మ షో ప్రోమో వైరల్..

సెకెండ్ హాఫ్ మాత్రం గ్రిప్పింగ్ గా హారర్ ఎలిమెంట్స్ ఎక్కడా తక్కువ చేయకుండా అదరగొట్టాడట డైరెక్టర్. తమిళ నటుడు శాండ సినిమాలో హైలెట్ అట. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో అదరగొట్టాడట. ఈ సినిమాతో బెల్లంకొండ బాబు హిట్ కొట్టాడని అంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ దయ్యం పట్టిన పాత్రలో క్లైమాక్స్ లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిందట.

థ్రిల్లర్ ఎపిసోడ్స్, సౌండింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో హారర్ అనుభవం ఇచ్చి భయపెట్టారట.కిష్కింధపురి ప్రేక్షకులను భయపెడుతూ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి అలరిస్తుందని అంటున్నారు. అలాగే పార్ట్ 2 కోసం కూడా లీడ్ ఇచ్చారట క్లైమాక్స్ లో.

Also Read : Jagapathi Babu : అతని కోసం నిర్మాతగా మారిన జగపతి బాబు.. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే నెక్స్ట్ సినిమాకు అడ్వాన్స్..