AR Murugadoss : ఫ్లాప్స్‌లో ఉన్నా కోటిన్నర పెట్టి కారు కొన్న స్టార్ డైరెక్టర్
4 సంవత్సరాలుగా సినిమాలు లేవు. చేతిలో ఒక కొత్త ప్రాజెక్టు తప్ప వేరేవీ లేవు.. కానీ ఆ డైరెక్టర్ కోటి రూపాయలు పైన విలువ చేసే లగ్జరీ కారు కొన్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
- Lakshmi 10tv
- Updated on- January 21, 2024 / 12:50 PM IST
AR Murugadoss
AR Murugadoss : 2001లో తమిళ సినిమా ‘ధీనా’ తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఏఆర్ మురుగదాస్ అనేక సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసారు. నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ డైరెక్టర్ ఓ ఖరీదైన కారు కొనడం హాట్ టాపిక్‌గా మారింది.
సెలబ్రిటీలు ఖరీదైన కార్లు కొనడం కొత్తేం కాదు. కానీ సినిమాలు లేక ఖాళీగా ఉన్న దర్శకుడు ఖరీదైన కారు కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ దర్శకుడే ఏఆర్ మురుగదాస్. 2012 లో విజయ్ హీరోగా మురుగదాస్ డైరెక్ట్ చేసిన తుపాకీ రూ.180 కోట్లకు పైగా వసూలు చేసింది. 2014 లో మళ్లీ విజయ్‌తో డైరెక్ట్ చేసిన కత్తి సినిమా సూపర్ హిట్ అయ్యింది. భారీ వసూళ్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో డైరెక్ట్ చేసిన స్పైడర్, రజనీకాంత్‌తో చేసిన దర్బార్ సినిమా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ఏ ప్రాజెక్టు చేయని మురుగదాస్ ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు.
Allu Arjun – Sneha Reddy : భార్య బిజినెస్ ప్రమోషన్స్ కోసం వచ్చిన అల్లు అర్జున్..
మురుగదాస్ కొత్తగా ఖరీదైన బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 (BMWX7) కారు కొన్నారు. దీని ధర రూ.1.30 కోట్లట. నాలుగేళ్లుగా సినిమాలు లేకపోయినా మురుగదాస్ ఇంత ఖరీదైన కారు ఎలా కొన్నారని జనాలు ఆశ్చర్యపోతున్నారు. కొత్త కారు కొనుగోలు చేసిన మురుగదాస్ తన కుటుంబంతో కారు పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
AR Murugadoss purchased a New BMW X7! pic.twitter.com/bdumokTKPG
— Christopher Kanagaraj (@Chrissuccess) January 19, 2024
