Yamadheera : ఎన్నికల ముందు ఈవీఎం ట్యాంపరింగ్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా.. ‘యమధీర’ ట్రైలర్ రిలీజ్..
తాజాగా నేడు ‘యమధీర’ ట్రైలర్ లాంచ్ చేశారు.
- Saketh U
- Published On : March 18, 2024 / 07:54 PM IST
Komal Kumar Cricketer Sreesanth EVM Tampering Story Movie Yamadheera Trailer Released
Yamadheera : భారత క్రికెటర్ శ్రీశాంత్ నటుడిగా సినిమాల్లో కూడా నటిస్తునం సంగతి తెలిసిందే. 2019లో కన్నడ హీరో కోమల్ కుమార్ నటించిన ‘కెంపేగౌడ 2’ సినిమాలో శ్రీశాంత్ విలన్ గా నటించి బెస్ట్ విలన్ గా పలు అవార్డులని కూడా అందుకున్నారు. కన్నడలో మంచి విజయం సాధించిన కెంపేగౌడ 2 సినిమా ఇప్పుడు తెలుగులో ‘యమధీర’ టైటిల్ తో రాబోతుంది.
శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా తాజాగా నేడు ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాతలు ప్రసన్న కుమార్, రామ సత్యనారాయణ, డి.ఎస్ రావు, వేదాల శ్రీనివాస్.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ సినిమాలో నాగబాబు, అలీ, సత్యప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగులో ఈ యమధీర సినిమా మార్చ్ 23న రిలీజ్ కాబోతుంది. మీరు కూడా యమధీర ట్రైలర్ చూసేయండి.
Also Read : Premikudu : రీ రిలీజ్ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభుదేవా ‘ప్రేమికుడు’ గ్రాండ్ రీ రిలీజ్..
ఇక ఈ ట్రైలర్ లాంచ్ అనంతరం నిర్మాత, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. విజయ్ సర్కార్ సినిమా అలాగే ఇది కూడా పొలిటికల్ డ్రామా. ఈ సినిమాలో ఈవీఎంల ట్యాంపరింగ్, పోలింగ్, ఎలక్షన్స్.. గురించి చాలా బాగా చూపించారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు ఈ సినిమా రానుంది అని తెలిపారు టెక్నికల్ వాల్యూస్ తో ఈ యమధీర సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు.
ఇక ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న వేదాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. అడగ్గానే ఈ ట్రైలర్ లాంచ్ కి వచ్చిన నిర్మాతలందరికి ధన్యవాదాలు తెలుపుతూ యమధీర సినిమా ఈవీఎం ట్యాంపరింగ్ పై తీసాము. అజర్ బైజాన్ కంట్రీలో ఎక్కువ శాతం షూటింగ్ చేసాము. ఈ సినిమాని మార్చ్ 23న రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు. త్వరలో ఎన్నికలు ఉండటంతో ఎలక్షన్స్ ముందు ఇలా ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి సినిమా తీసుకొస్తుండటంతో చర్చగా మారింది. మరి సినిమా ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.
