Premikudu : రీ రిలీజ్ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభుదేవా ‘ప్రేమికుడు’ గ్రాండ్ రీ రిలీజ్..

తాజాగా రీ రిలీజ్ ప్రెస్ మీట్ తో పాటు 30 ఏళ్ళ వేడుక కూడా నిర్వహించారు.

Premikudu : రీ రిలీజ్ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభుదేవా ‘ప్రేమికుడు’ గ్రాండ్ రీ రిలీజ్..

Prabhudeva Premikudu Movie Re Releasing will Plan Pre Release Event

Updated On : March 18, 2024 / 6:45 PM IST

Premikudu : ప్రభుదేవా, నగ్మా జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాదలన్. ఈ సినిమాని తెలుగులో ప్రేమికుడుగా రిలీజ్ చేశారు. 1994లో విడుదలయిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇక ఏఆర్ రహమాన్ అందించిన పాటలు ఇప్పటికి వింటూనే ఉంటాము. ఈ సినిమా రిలీజయి 30 ఏళ్ళు అవుతుండటంతో ప్రేమికుడుని గ్రాండ్ గా తెలుగులో రీ రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా రీ రిలీజ్ ప్రెస్ మీట్ తో పాటు 30 ఏళ్ళ వేడుక కూడా నిర్వహించారు. ప్రేమికుడు 30 ఏళ్ళ వేడుక, రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాతలు రమణ, మురళీధర్, ప్రసన్నకుమార్, రామ సత్యనారాయణ, దర్శకుడు ముప్పలనేని శివ, శివనాగు నర్రా, శోభారాణి.. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read : Magadheera : చరణ్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్.. పుట్టినరోజుకి బ్లాక్ బస్టర్ ‘మగధీర’ రీ రిలీజ్..

ఈ ప్రెస్ మీట్ కి హాజరయిన ప్రముఖులు ప్రేమికుడు సినిమా గురించి మాట్లాడారు. అందులో నటించిన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను తలచుకొని నిర్మాత ప్రసన్న కుమార్ ఆయనతో కూడా డ్యాన్స్ వేయించారు అంటూ అప్పటి జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే కచ్చితంగా 100 కోట్లు కొల్లగొట్టేదని దర్శకుడు శివనాగు అన్నారు.

Prabhudeva Premikudu Movie Re Releasing will Plan Pre Release Event

ఇక ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్న నిర్మాతలు రమణ, మురళీధర్ మాట్లాడుతూ.. 30 సంవత్సరాల క్రితం సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాని మేము రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించి రిలీజ్ డేట్ ప్రకటిస్తాము. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభుదేవా గారిని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాము అని తెలిపారు. అయితే రీ రిలీజ్ సినిమాకి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తాము అనడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో మరో కొత్త ట్రెండ్ మొదలవుతుందేమో చూడాలి.