Yamadheera Teaser : క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా ‘యమధీర’.. టీజర్ విడుదలైంది చూశారా..

క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా నటిస్తున్న 'యమధీర' మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.

Komal Kumar Cricketer Sreesanth Yamadheera Teaser released

Yamadheera Teaser : భారత క్రికెటర్ శ్రీశాంత్ మైదానంలో ఫాస్ట్ బౌలర్ గా ఆకట్టుకోవడమే కాదు, సినిమాల్లో నటించి యాక్టర్ గా కూడా మంచి మార్కులను అందుకున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు ఈ క్రికెటర్ ఐదు సినిమాల్లో నటించారు. కాగా 2019లో కన్నడ హీరో కోమల్ కుమార్ నటించిన ‘కెంపేగౌడ 2’ సినిమాలో విలన్ గా నటించిన శ్రీశాంత్.. బెస్ట్ విలన్ గా అవార్డుని కూడా అందుకున్నారు.

కన్నడలో మంచి విజయం సాధించిన ఈ సినిమాని ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ‘యమధీర’ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ తమ తొలి చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్ ని టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు నిర్మాత అయిన అశోక్ కుమార్ లాంచ్ చేసారు. ఈ టీజర్ లో మూవీలోని ముఖ్యపాత్రలను పరిచయం చేసారు.

Also read : Allu Arjun : అల్లు అర్జున్‌కు మమితా బైజు ఎంత పెద్ద అభిమానో తెలుసా..?

 

ట్రెండింగ్ వార్తలు