Allu Arjun : అల్లు అర్జున్‌కు మమితా బైజు ఎంత పెద్ద అభిమానో తెలుసా..?

టాలీవుడ్ కుర్రాళ్ళు మనసు పారేసుకున్న మమితాకు అల్లు అర్జున్‌ అంటే మరింత అంత అభిమానమా..?

Allu Arjun : అల్లు అర్జున్‌కు మమితా బైజు ఎంత పెద్ద అభిమానో తెలుసా..?

Premalu actress Mamitha Baiju comments about Allu Arjun

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ తో పాటు మలయాళ ఇండస్ట్రీలో కూడా భారీ క్రేజ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా అల్లు అర్జున్ ని మలయాళ ఆడియన్స్ అభిమానిస్తుంటారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, అక్కడి స్టార్స్ కూడా బన్నీని అభిమానిస్తుంటారు. మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోహీరోయిన్స్ ఎన్నో ఇంటర్వ్యూల్లో అల్లు అర్జున్ పై అభిమానం గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.

ఈక్రమంలోనే మలయాళ హీరోయిన్ ‘మమితా బైజు’ కూడా అల్లు అర్జున్ పై తన అభిమానాన్ని గురించి చెబుతూ వచ్చారు. రీసెంట్ గా ఈ హీరోయిన్ ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈ అమ్మడి పర్ఫార్మెన్స్ కి టాలీవుడ్ కుర్రాళ్ళు ఫిదా అయ్యిపోయారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా టైం లైన్ అంతా మమితా ఫీడ్ తో నిండిపోయింది.

Also read : SKN : ఎన్టీఆర్ అభిమానికి టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ భారీ సాయం.. ఎందుకో తెలుసా..!

కాగా ప్రేమలు ప్రమోషన్స్ లో ఉన్న మమితా మరోసారి అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. “నేను అల్లు అర్జున్ గారిని చాలా అభిమానిస్తుంటా. ఎంతలా అంటే, ఆయన ప్రతి మూవీని నేను పదిసార్లు కంటే ఎక్కువే చూసాను. అయినాసరి ఇప్పటికి నేను ఎంజాయ్ చేయాలంటే.. మళ్ళీ అవే సినిమాలు పెట్టుకొని చూస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఈ కామెంట్స్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. “మనం మనసు పారేసుకున్న మమితా, అల్లు అర్జున్ కి ఇంత పెద్ద అభిమానా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, భవిషత్తులో కుదిరితే అల్లు అర్జున్ అండ్ మమితా కాంబినేషన్ లో ఓ సినిమా కూడా వస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరుకుంటూ ఈ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.