SKN : ఎన్టీఆర్ అభిమానికి టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ భారీ సాయం.. ఎందుకో తెలుసా..!
ఎన్టీఆర్ అభిమానికి టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ భారీ సాయం. ప్రశంసల వర్షం కురిపిస్తున్న తోటి ఎన్టీఆర్ అభిమానులు, నెటిజెన్స్.

Tollywood Producer Sreenivas Kumar alias SKN help to NTR fan
SKN : ‘బేబీ’ మూవీ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ అలియాస్ SKN.. ప్రస్తుతం వరుస సినిమాలను సెట్ చేస్తూ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ నిర్మాత ఒక హీరో అభిమానికి సహాయం చేసి తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఇటీవల గోదావరి జిల్లాకు చెందిన పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమాని రోడ్డు యాక్సిడెంట్ కి గురయ్యారు.
అమలాపురం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆ అభిమాని కుటుంబం ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, అతను కోలుకోవడం కోసం ఆర్ధిక సాయం కావాలంటూ తోటి ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇక అది చూసిన ఎస్‌కేఎన్.. వెంటనే ఆ అభిమాని కోసం 50 వేల రూపాయిలను డొనేట్ చేసారు. అంతేకాదు, ఆ అభిమాని చికిత్స కోసం మిగిలిన హీరో ఫ్యాన్స్ కూడా ముందుకు రావాలంటూ కోరుతూ ట్వీట్ కూడా చేసారు.
Also read : OTT : ఆ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ బ్లాక్ చేసిన కేంద్రప్రభుత్వం.. అలాగే పేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్..
I have done my part for initial help of 50,000
Wishing him a speedy recovery and request Tharak gari fans and other movie lovers also contribute ur self to him pic.twitter.com/WLp6TcEQPR— SKN (Sreenivasa Kumar) (@SKNonline) March 13, 2024
ఇక ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు, నెటిజెన్స్.. SKN పై ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. గతంలో బేబీ మూవీ దర్శకుడు సాయి రాజేష్ కూడా ఇలాగే ఓ అభిమాని కుటుంబం చికిత్స కోసం 50 వేల రూపాయిలు డొనేట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. బేబీ వంటి చిన్న సినిమాని కూడా ఆదరించి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకుల కోసం.. ఈ దర్శకనిర్మాతలు నిర్మాతలు నిలబడడం అందర్నీ ఆకర్షిస్తుంది.
కాగా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘బేబీ’ మూవీని ఇప్పుడు బాలీవుడ్ అండ్ కోలీవుడ్ కి కూడా తీసుకు వెళ్తున్నారు. బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో కొడుకుని లాంచ్ చేస్తూ ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. బాలీవుడ్ రీమేక్ ని కూడా సాయి రాజేష్ డైరెక్ట్ చేయబోతున్నారు.