దర్శకులు కొరటాల శివ త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి..
రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి ‘మిర్చి’తో మెగాఫోన్ చేతబట్టి.. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’.. ఇలా వరుస సూపర్ హిట్స్‌తో ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ ఇవ్వడమే కాక టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలిచారు కొరటాల శివ. తన సినిమాల ద్వారా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సమాజానికి చిన్నపాటి సందేశమివ్వడం ఆయన స్టైల్. అయితే కొరటాల ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారనే వార్త ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అదేంటంటే త్వరలో కొరటాల రిటైర్మెంట్ తీసుకోనున్నారట. డైరెక్షన్ మొదలుపెట్టే మందే 10 సినిమాలకే పరిమితమైనట్లు శివ తన సన్నిహితుల వద్ద చెప్పారట. దర్శకుడిగా జర్నీ స్టార్ట్ చేయకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ఇదే విషయాన్ని తనకు అడ్వాన్సులు ఇవ్వడానికి వచ్చిన పలువురు నిర్మాతలకు సైతం చెప్పినట్లు తెలుస్తోంది.
తన దగ్గరున్న 10 కథలు మాత్రమే డైరెక్ట్ చేసి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో కంటిన్యూ అయినా కూడా దర్శకత్వం వైపు మాత్రం వెళ్లనని, ఒకవేళ కొత్త దర్శకులను ప్రొత్సహించడానికి నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఇది ఆయన డైరెక్ట్ చేస్తున్న ఐదో సినిమా.. అంటే మరో ఐదు సినిమాలతో కొరటాల మెగాఫోన్ పక్కన పెట్టనున్నారన్నమాట.