KotaBommali PS : మలయాళ రీమేక్‌లో శ్రీకాంత్.. ఆకట్టుకుంటున్న కోట బొమ్మాళి PS ఫస్ట్ లుక్
తెలుగు ప్రేక్షకులకు వినోదభరితమైన కంటెంట్‌ని అందించే కొన్ని నిర్మాణ సంస్థల్లో GA 2 పిక్చర్స్ ఒకటి. 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఈ సంస్థ నుంచి వచ్చాయి.
- Thota Vamshi Kumar
- Published On : July 31, 2023 / 05:40 PM IST
KotaBommali PS First look
KotaBommali PS First look : తెలుగు ప్రేక్షకులకు వినోదభరితమైన కంటెంట్‌ని అందించే కొన్ని నిర్మాణ సంస్థల్లో GA 2 పిక్చర్స్ ఒకటి. ‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘ప్రతి రోజు పండగే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఈ సంస్థ నుంచి వచ్చాయి. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రొడక్షన్ నెం.8 గా ఓ మలయాళ సూపర్ హిట్ చిత్రం రీమేక్‌గా రాబోతుంది.
ఈ చిత్రంలో శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన నాయాట్టుకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో ఈ సినిమా రూపుద్దికుంటున్న ఈ సినిమాకి సంబంధించిన పవర్‌పుల్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Game Changer : ఎట్టకేలకు గేమ్ చెంజర్ నుంచి అప్డేట్ వచ్చేసింది.. గెట్ రెడీ చరణ్ ఫ్యాన్స్..
ఈ చిత్రానికి ‘కోట బొమ్మాళి PS’ అనే టైటిల్‌ను పెట్టారు. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివానిల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. పరారీలో కోట బొమ్మాళి పోలీసులు అనే టెక్ట్స్‌తో ఫ్లైయర్‌తో ప్రారంభమవుతోంది. రాజకీయాలు,పోలీసు బలగాలకు సంబంధించిన తుపాకులు, బ్యాలెట్ పేపర్లు, కరపత్రాలు మరెన్నో అంశాలను చూపించి, టైటిల్‌ను రివీల్ చేశారు.
BiggBoss 7 : బిగ్‌బాస్ 7 కొత్త ప్రోమో చూశారా..? కంటెస్టెంట్లకు చుక్కలే అంటున్న నాగార్జున
ఈ చిత్రానికి జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గరుడ గమన వృషభ వాహన, రోర్‌షాచ్ ఫేమ్ రంజిన్ రాజ్-మిధున్ ముకుందన్ సంగీతం సమకూరుస్తున్నారు.
https://youtu.be/Mt2hbfY_mG4
