Game Changer : ఎట్టకేలకు గేమ్ చెంజర్ నుంచి అప్డేట్ వచ్చేసింది.. గెట్ రెడీ చరణ్ ఫ్యాన్స్..
గేమ్ చెంజర్ నుంచి డైరెక్టర్ శంకర్ ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చేశాడు. ఈ ఆగష్టులో..

S Shankar gave update on Ram Charan Game Changer movie
Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న పొలిటికల్ డ్రామా మూవీ ‘గేమ్ చెంజర్’. ఈ సినిమాలో చరణ్.. తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీతో బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) మరోసారి చరణ్ కి జంటగా కనిపించబోతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ.. శంకర్ ఇండియన్ 2 కమిట్‌మెంట్ తో గేమ్ చెంజర్ చిత్రీకరణ లేట్ అవుతూ వచ్చింది.
Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. సాక్షితో వరుణ్ రొమాన్స్..!
ఇక మూవీ నుంచి టైటిల్ అండ్ చరణ్ ఫస్ట్ లుక్ అప్డేట్ తప్ప మరొకటి లేదు. నేడు జులై 31న హీరోయిన్ కియారా పుట్టినరోజు అయినాసరి.. మేకర్స్ నుంచి ఆమెకు సంబంధించిన అప్డేట్ రాలేదు. దీంతో రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుని గట్టిగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అయితే నేటితోనే దర్శకుడు శంకర్ ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్ళు అవ్వడంతో.. చరణ్ సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. ఇక ట్వీట్ కి శంకర్ బదులివ్వడమే కాకుండా గేమ్ చెంజర్ అప్డేట్ కూడా ఇచ్చి అభిమానులను ఖుషీ చేశాడు.
Pawan Kalyan : వరుసగా మూడుసార్లు 100 కోట్లు మూవీస్.. ఆ క్లబ్‌లో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా..?
“థాంక్యూ రామ్ నీ స్వీట్ విషెస్‌కి. ఆగష్టులో మన గేమ్ చెంజర్ తదుపరి అడుగు కోసం వెయిట్ చేస్తున్నా” అంటూ ట్వీట్ చేశాడు. కాగా కొన్ని రోజులు నుంచి ఫిలిం వర్గాల్లో.. ఆగష్టు 15న ఇండిపెండెన్స్ సందర్భంగా మూవీ నుంచి గ్లింప్స్ లేదా టీజర్ వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు శంకర్ ఆగష్టు అంటూ ట్వీట్ చేయడంతో.. గ్లింప్స్ లేదా టీజర్ రావడం ఫిక్స్ అని అభిమానులు సంబర పడుతున్నారు. మరి శంకర్ మాట్లాడింది.. గ్లింప్స్ లేదా టీజర్ గురించా? తదుపరి షెడ్యూల్ గురించా? అనేది వేచి తెలుసుకోవాలి.
Thank you Ram for your sweet wishes! #GameChanger Can’t wait for our next move this August! ?❤️ https://t.co/xd1uyxBljc
— Shankar Shanmugham (@shankarshanmugh) July 31, 2023