Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. సాక్షితో వరుణ్ రొమాన్స్..!
వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. 'నీ జతై' అంటూ సాగే రొమాంటిక్ నెంబర్..

Nee Jathai Lyrical Video song released from Varun Tej Gandeevadhari Arjuna
Gandeevadhari Arjuna : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ సినిమాలో వరుణ్ కి జోడిగా కనిపించబోతుంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసింది. ‘నీ జతై’ అంటూ సాగే రొమాంటిక్ నెంబర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది.
BiggBoss 7 : బిగ్‌బాస్ 7 కొత్త ప్రోమో చూశారా..? కంటెస్టెంట్లకు చుక్కలే అంటున్న నాగార్జున
Devara : ఒకటి కాదు, రెండు కాదు.. అన్ని యాక్షన్ షెడ్యూల్సే.. దేవర వేట మూమూలుగా లేదుగా..
కాగా ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో అంచనాలు అమాంతం పెంచేశాయి. ఒక చిన్న టీజర్ లోనే హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ చూపించి మూవీ ఎలా ఉండబోతుందో అని చిన్న శాంపిల్ ఇచ్చారు. ఇక టీజర్ చూసిన ఆడియన్స్.. వరుణ్ తేజ్ కట్ అవుట్ కి పడాల్సిన సినిమా ఇలాంటిదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Pawan Kalyan : వరుసగా మూడుసార్లు 100 కోట్లు మూవీస్.. ఆ క్లబ్‌లో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా..?
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఆగష్టు 25న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వస్తుంది. మెగా హీరోల్లో ఒక్క వరుణ్ తేజ్ మాత్రమే డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. మరి ఈ సినిమాతో టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్ ఎంతలా ఆకట్టుకుంటాడో చూడాలి.