Devara : ఒకటి కాదు, రెండు కాదు.. అన్ని యాక్షన్ షెడ్యూల్సే.. దేవర వేట మూమూలుగా లేదుగా..

మరో యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఎన్టీఆర్ దేవర. ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపు అన్ని యాక్షన్ షెడ్యూల్సే..

Devara : ఒకటి కాదు, రెండు కాదు.. అన్ని యాక్షన్ షెడ్యూల్సే.. దేవర వేట మూమూలుగా లేదుగా..

NTR Devara movie starts another action schedule in hyderabad

Updated On : July 31, 2023 / 4:30 PM IST

Devara : ఎన్టీఆర్ (NTR) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంది గాని షూటింగ్ మాత్రం అసలు సమయం వేస్ట్ చేయకుండా ముందుకు తీసుకు వెళ్తుంది. అది కూడా పక్కా ప్లానింగ్‌తో. ఇప్పటికే అనేక షెడ్యూల్స్ ని ప్రత్యేక సెట్స్ వేస్తూ పూర్తి చేస్తూ వస్తున్న మూవీ టీం.. తాజాగా మరో షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేస్తూ వాటర్ లో బోట్ ఉన్న పిక్ ని షేర్ చేసింది.

Pawan Kalyan : వరుసగా మూడుసార్లు 100 కోట్లు మూవీస్.. ఆ క్లబ్‌లో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా..?

ఈ యాక్షన్ షెడ్యూల్ కోసం ఆల్రెడీ అనేక రిహార్సల్స్ కూడా చేసినట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ షెడ్యూల్ ని కూడా హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి దాదాపు అన్ని యాక్షన్ షెడ్యూల్సే జరుపుకుంటూ వస్తుంది. ఈ మూవీ సెట్స్ నుంచి ఇటీవల కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఆ పిక్స్ లో సినిమా కోసం వాడుతున్న బ్లడ్ బాటిల్స్ గుంపులుగా పడేసి కనిపిస్తున్నాయి. వరుస యాక్షన్ షెడ్యూల్, లీకైన పిక్స్ చూస్తుంటే.. మూవీలో యాక్షన్ ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.

Jawan : మరోసారి షారుఖ్‌తో ప్రియమణి మాస్ స్టెప్పులు.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది చూశారా..?

హాలీవుడ్ మూవీ ‘ట్రాన్స్‌ఫార్మర్స్’కు యాక్షన్ పార్ట్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ ‘కెన్నీ బెట్స్’ ఈ సినిమాకి యాక్షన్ పార్ట్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఆక్వా మ్యాన్ వంటి సినిమాకి VFX డిజైనర్ గా వర్క్ చేసిన ‘బ్రాడ్ మిన్నిచ్’ని కూడా కొరటాల ఈ మూవీ కోసం రంగంలోకి దించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ ఈ సినిమాకి రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.