Jawan : మరోసారి షారుఖ్‌తో ప్రియమణి మాస్ స్టెప్పులు.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది చూశారా..?
చెన్నై ఎక్స్‌ప్రెస్ తరువాత ప్రియమణి మరోసారి షారుఖ్ తో కలిసి మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టింది. జవాన్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

Priyamani and Shahrukh Khan dance number from Jawan Dhumme Dhulipelaa
Jawan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘జవాన్’. ఈ చిత్రంలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీలో నయనతార (Nayanathara) హీరోయిన్ గా నటిస్తుంటే, విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు. దీపికా పదుకొనే, ప్రియమణి (Priyamani), తమిళ్ హీరో విజయ్ ముఖ్య పాత్రల్లో మెరవబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు చిత్ర యూనిట్.. ప్రమోషన్స్ కూడా చేస్తూ వస్తుంది.
Bro Collections : 100 కోట్లు దాటేసిన ‘బ్రో’ కలెక్షన్స్.. పవన్ కెరీర్లోనే అత్యంత ఫాస్ట్‌గా..
ఇటీవలే ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ‘దుమ్మే దులిపేలా’ (Dhumme Dhulipelaa) అనే సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ సాంగ్ ని దాదాపు 1000 మంది డాన్సర్స్ తో తమిళ్ కొరియోగ్రాఫర్ శోభి గ్రాండ్ గా డిజైన్ చేశాడు. కేవలం ఈ ఒక్క పాట తీయడానికే 15 కోట్లు ఖర్చు అయ్యిందని సమాచారం.
Priyanka Mohan : పవన్ కళ్యాణ్ OG భామ ప్రియాంక మోహన్ స్టైలిష్ ఫోజులు..
కాగా ఈ పాటలో ప్రియమణి, షారుఖ్ తో కలిసి మరోసారి మాస్ స్టెప్పులు వేసింది. గతంలో షారుఖ్ సూపర్ హిట్ మూవీ చెన్నై ఎక్స్‌ప్రెస్ లో ఒక స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తూనే.. ఈ సాంగ్ లో షారుఖ్ తో కలిసి డాన్స్ వేసి ఆకట్టుకుంటుంది. కాగా ఈ పాటలో ఒక షారుఖ్ తప్ప మిగిలిన డాన్సర్స్ అంతా ఆడవాళ్లే కావడం గమనార్హం. సాంగ్ లో కనిపించిన విజువల్స్ బట్టి చూస్తుంటే.. షారుక్ లేడీస్ జైలుకి జైలర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.