Pawan Kalyan : వరుసగా మూడుసార్లు 100 కోట్లు మూవీస్.. ఆ క్లబ్‌లో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా..?
పవన్ కళ్యాణ్ వరుస మూడుసార్లు 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు. అయితే పవన్ సినిమాల్లో ఇప్పటివరకు ఎన్ని 100 కోట్ల మార్క్ ని అందుకున్నాయి తెలుసా..?

Pawan Kalyan movie collections cross 100 crores mark list
Pawan Kalyan : టాలీవుడ్ లో చాలా మంది హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడానికి చాలా కష్టపడుతుంటారు. డాన్స్‌లు, భారీ ఫైట్స్ చేస్తూ ఆడియన్స్ ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇవేవి చేయనవసరం లేదు. జస్ట్ అలా స్క్రీన్ పై పవన్ కనిపిస్తే చాలు కాసుల వర్షం కురుస్తుంది. దీంతో నిర్మాతలు.. ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయ్యి డబ్బింగ్ మూవీని కూడా మళ్ళీ రీమేక్ చేయడానికి సిద్దమవుతుంటారు. అయితే ఆ చిత్రాలతో కూడా పవన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటాడు.
Jawan : మరోసారి షారుఖ్‌తో ప్రియమణి మాస్ స్టెప్పులు.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది చూశారా..?
ఇక తాజాగా కూడా పవన్.. బ్రో (Bro) అనే రీమేక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సాయి ధరమ్ తేజ్ అండ్ పవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ జులై 28న రిలీజ్ అయ్యింది. మొదటిరోజే 48 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ.. మూడు రోజులకే 100 కోట్ల మార్క్ ని దాటేసింది. పవన్ కెరీర్ లో ఇంత ఫాస్ట్ గా ఈ మార్క్ ని దాటిన మూవీ ‘బ్రో’నే. ఇక ఈ చిత్రం పవన్ హ్యాట్రిక్ కొట్టాడు. వరసగా మూడుసార్లు 100 కోట్ల క్లబ్ లోకి పవన్ ఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది వచ్చిన భీమ్లా నాయక్, అంతకుముందు ఇయర్ లో వచ్చిన వకీల్ సాబ్ సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నాయి.
అయితే పవన్ సినిమాల్లో ఇప్పటివరకు ఎన్ని 100 కోట్ల మార్క్ ని అందుకున్నాయి తెలుసా..? మొత్తం ఆరు సినిమాలు 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాయి. మొదటి సినిమా గబ్బర్ సింగ్.. ఈ మూవీ 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. 180 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సెకండ్ ప్లేస్ లో అత్తారింటికి దారేది నిలిచింది. ఆ తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ 140 కోట్లు అందుకుంది. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న మూవీస్ పై కూడా చాలా హై బజ్ ఉంది. దీంతో ఆ సినిమాల టాక్ ఎలా ఉన్న గాని.. 100 కోట్ల మార్క్ అందుకోవడం పెద్ద సమస్య కాదు.