×
Ad

Sivangivey : ‘శివంగివే’ స్పెషల్ షో.. నిహారిక, కోవై సరళ సందడి.. బాహుబలి థాలితో ప్రభాస్ పెద్దమ్మ..

జీ తెలుగు 'శివంగివే' స్పెషల్ షోలో నిహారిక, కోవై సరళ సందడి చేస్తే బాహుబలి థాలితో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి అందరికి మంచి విందు ఇచ్చారు.

  • Published On : March 9, 2024 / 08:39 PM IST

Kovai Sarala Niharika Shyamala Devi at Sivangivey special show

Sivangivey : తెలుగు టెలివిజన్ ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తూ వస్తున్న జీ తెలుగు.. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మరింత ప్రత్యేకంగా, ఘనంగా చేయబోతుంది. ఈక్రమంలోనే ‘శివంగివే’ అంటూ ఓ స్పెషల్ షోని చేసింది. ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఘనంగా సత్కరించింది.

మహిళల ధైర్యసాహసాలు, విజయాలను గౌరవిస్తూ సాగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి నిహారిక కొణిదెల, అభినయ, హాస్యనటి కోవై సరళ, కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి, పావలా శ్యామల, తారకరత్న వైఫ్ అలేఖ్య రెడ్డితో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నిహారిక, కోవై సరళ తమ ప్రెజెన్స్ తో అందర్నీ ఎంటర్టైన్ చేస్తే.. శ్యామల దేవి బాహుబలి థాలితో అందరికి మంచి విందు ఇచ్చారు.

Also read : Sukrithi Ambati : తొమ్మిదేళ్ల తరువాత మళ్ళీ కనిపించిన నటి.. నూకరాజు కోసం భావన..

ఇప్పటీకే ఈ స్పెషల్ షోకి సంబంధించిన ప్రోమోలను షో నిర్వాహకులు రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ స్పెషల్ షో మార్చి 10న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతుంది. మరి ఈ ఎంటర్టైన్మెంట్ అండ్ గౌరవనీరాజనం శివంగివేని మీ జీ తెలుగులో తప్పక చూసేయండి.