krithi shetty: నాకు లక్ లేదంటున్నారు.. ‘ఐరన్ లెగ్’ అంటున్నారు.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్ వైరల్
లక్ లేకపోవడం వల్ల అవకాశాలు రావడం లేదు అందం కరక్ట్ కాదు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి(krithi shetty).
- V Santhosh Kumar
- Published On : April 10, 2026 / 07:18 AM IST
Krithi shetty latest comments about trolling on her
- ‘ఐరన్ లెగ్’ కామెంట్స్‌పై కృతి శెట్టి ఆవేదన
- నా కష్టం కనిపించడం లేదా అంటూ కామెంట్స్
- LIK కి ఆ కామెంట్స్ రావు అంటూ ధీమా
krithi shetty: నటిగా ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతానని, కానీ ఫలితం సరిగ్గా లేనప్పుడు తనను ‘ఐరెన్ లెగ్’ అని ముద్ర వేయడం బాధాకరమని కృతి శెట్టి(krithi shetty) ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విజయం తన చేతిలో లేదని, కేవలం లక్ లేదనే కారణంతో అవకాశాలు కోల్పోవడం ఒక నటిగా తనను కృంగదీస్తోందని ఆమె అన్నారు. ప్రస్తుతం నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా విషయంలో కూడా ప్రేక్షకులు ఇలాంటి సందేహాలు వ్యక్తం చేయడం తనను కలచివేస్తోందని, అయినా తన కృషిని ఎప్పటికీ ఆపనని ఆమె స్పష్టం చేశారు.
ఈ చిత్రంలో తాను ‘ధీమా’ అనే నోమోఫోబియా ఉన్న అమ్మాయిగా నటించానని కృతి తెలిపారు. సోషల్ మీడియాకు బానిసైన ఈ పాత్ర చేయడం తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని, కథ 2040 నేపథ్యంలో సాగినా అందరికీ కనెక్ట్ అవుతుందని వివరించారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో నయనతారతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని, ఒక సమస్య వచ్చినప్పుడు ఆమె ఫోన్ చేసి తనను గైడ్ చేశారని కృతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
నెగటివ్ ట్రోల్స్ చేసే వారు తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని, పాజిటివ్ థింకింగ్ ముఖ్యం అని ఆమె సూచించారు. తన వ్యక్తిగత జీవితం గురించి స్పందిస్తూ, తనకు పాత కాలపు ప్రేమలంటేనే ఇష్టమని, ప్రస్తుతం దృష్టి అంతా నటనపైనే ఉందని చెప్పారు. మరో ఐదు పదేళ్ల తర్వాత డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంటానని వెల్లడించిన ఆమె, ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో పాటు తమిళ, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
