Krithi Shetty : లవ్ బ్రేకప్ గురించి చెప్పిన కృతి శెట్టి.. ఇంటర్వ్యూలో ఎమోషనల్..

కృతి సినిమాల ఫలితం ఎలా ఉన్నా అవకాశాలు అందుకుంటుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. (Krithi Shetty)

  • Published On : April 7, 2026 / 06:47 PM IST

Krithi Shetty

Krithi Shetty : చిన్న వయసులోనే కృతిశెట్టి ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా సెన్సేషనల్ హిట్ కొట్టి వరుసగా ఓ రెండు మూడు సినిమాలు హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత నుంచి ఫ్లాప్స్ తోనే కృతి కెరీర్ నడుస్తుంది. కృతి సినిమాల ఫలితం ఎలా ఉన్నా అవకాశాలు అందుకుంటుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.

త్వరలో కృతిశెట్టి ప్రదీప్ రంగనాథన్ సరసన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాతో ఏప్రిల్ 10న తెలుగు, తమిళ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు.

Also Read : Vijay : తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కి భారీ షాక్.. ఆ నియోజకవర్గంలో గెలుస్తాడా?

ఈ ఇంటర్వ్యూలో సుమ మీకు లవ్ బ్రేకప్ అయిందా అని హీరో, హీరోయిన్స్ ని అడిగింది. దీనికి కృతి శెట్టి సమాధానమిస్తూ.. నాకు బ్రేకప్ అయింది. మా అమ్మకు కూడా తెలుసు. నేను ఫ్యూచర్ లో సింగిల్ గా ఉండటానికే ఇష్టపడతాను అని చెప్తూ కాస్త ఎమోషనల్ అయింది. దీంతో కాలేజీ చదివే రోజుల్లోనే కృతికి లవ్ ఫెయిల్యూర్ అయిందేమో అని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఫుల్ లవ్ స్టోరీ, ఎందుకు బ్రేకప్ అయింది అనేది మాత్రం చెప్పలేదు. ఇక హీరో ప్రదీప్ రంగనాథన్.. తనకు కూడా పాస్ట్ లో కొన్ని బ్రేకప్స్ అయ్యాయి అని తెలిపాడు.