Vijay : తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కి భారీ షాక్.. ఆ నియోజకవర్గంలో గెలుస్తాడా?
తమిళనాడు ఎన్నికల హడావిడి మొదలయిన దగ్గర్నుంచి విజయ్ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు. (Vijay)
Vijay
Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23 జరుగనున్నాయి. DMK కూటమి, NDA కూటమితో పాటు ఈ సారి తమిళ్ స్టార్ హీరో విజయ్ తన TVK పార్టీ తరపున అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడు. విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ అనే రెండు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నాడు. విజయ్ ని అక్కడి ప్రస్తుత ప్రభుత్వం, DMK పార్టీ సీరియస్ గానే తీసుకున్నట్టు సమాచారం.
తమిళనాడు ఎన్నికల హడావిడి మొదలయిన దగ్గర్నుంచి విజయ్ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్నికల వేళ విజయ్ కి పెరంబూర్ నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది.
Also Read : Manchu Lakshmi : బాలయ్య బాబు పేరు చెప్పి ఊరందర్నీ మోసం చేసిన మంచు లక్ష్మి..
విజయ్ పూర్తి పేరు C జోసెఫ్ విజయ్. అయితే పెరంబూర్ లో విజయ్, జోసెఫ్, G విజయ్, K విజయ్, S జోసెఫ్, M జోసెఫ్, P విజయ్.. ఇలా వివిధ పేర్లతో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. వేరే పార్టీల వాళ్ళే ఓటర్లని కన్ఫ్యూజ్ చేసి విజయ్ ని ఓడగొట్టడానికి ఇలా విజయ్, జోసెఫ్ అనే పేర్లతో ఉన్నవారిని పెరంబూర్ లో బరిలో దింపారని తమిళ మీడియా అంటుంది. పెరంబూర్ లో మొత్తం 40 మంది నామినేషన్స్ వేశారని సమాచారం. మరి పెరంబూర్ లో విజయ్ కి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
