Krithi Shetty: బేబమ్మ కోరిక మామూలుగా లేదుగా..?
‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి, ఆ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకుంది. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్...
- Anil Aaleti
- Published On : April 30, 2022 / 05:27 PM IST
Krithi Shetty Wish Will Shock You
Krithi Shetty: ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి, ఆ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకుంది. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్ని పిండేసింది ఈ భామ. ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ పాత్రతోనే ఇప్పటికీ ఆమెను అభిమానులు పిలుస్తున్నారంటే.. ఆమెకు ఆ సినిమా ఎలాంటి గుర్తింపును ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
Krithi Shetty : పూల చీరలో పరిమళాలు వెదజల్లుతున్న కృతి
అయితే ‘ఉప్పెన’ ఇచ్చిన బూస్ట్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నా, చాలా సెలెక్టివ్‌గా తన పాత్రలను ఎంచుకుంటోంది ఈ బ్యూటీ. సినిమా సినిమాకు తన పాత్రలో వేరియేషన్ ఉండేలా చాలా జాగ్రత్త పడుతోంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి శెట్టి తన మనసులోని మాటలను ప్రేక్షకులతో పంచుకుంది. తాను సినిమాల్లో మంచి స్థానానికి చేరుకోవడానికి తాను ఎంచుకునే పాత్రలే దోహదపడుతున్నాయని.. అందుకే తాను పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పుకొచ్చింది. గతంలో ఎప్పుడూ చేయని పాత్ర అయితేనే ఆమె ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట.
Krithi Shetty : బుల్లెట్ బండిపై డ్యూయెట్.. శింబు పాటకి అదిరిపోయే స్టెప్స్‌తో రామ్, కృతి
ఇక ఈ బ్యూటీకి వైవిధ్యమైన సినిమాలు అంటే ప్రాణం అని.. అందుకే అలాంటి సినిమాలు తనకు ఎప్పుడు దొరుకుతాయా అని చాలా ఆశగా చూస్తుందట. అంతేగాక.. ఈ బ్యూటీకి చిన్నప్పటి నుండి రాజకుమారి పాత్రల్లో నటించాలని చాలా కోరికగా ఉందని.. తన కోరిక ఎప్పుడు తీరుతుందో అని మంచి అవకాశం కోసం చూస్తున్నట్లు బేబమ్మ పేర్కొంది. ఇక సినిమాల పరంగా కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తుండగా, నితిన్‌తో కలిసి ‘మాచర్ల నియోజకవర్గం’, అలాగే రామ్ పోతినేనితో కలిసి ‘ది వారియర్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరి బేబమ్మ కోరికను ఎవరు తీరుస్తారో చూడాలి.
