Kriti Kharbanda : పెళ్లిపీటలు ఎక్కబోతున్న పవన్ హీరోయిన్.. ప్రియుడితో ఆ రోజే పెళ్లి..

తాజాగా కృతి ఖర్బందా - పుల్కిత్ సామ్రాట్ పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.

Kriti Kharbanda – Pulkit Samrat : టాలీవుడ్ లో బోణి, తీన్ మార్, Mr. నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్లీ.. లాంటి పలు హిట్ సినిమాల్లో కనిపించిన కృతి ఖర్బందా ప్రస్తుతం బాలీవుడ్ లోనే అడపాదడపా సినిమాలు చేస్తుంది. 2019 నుంచి కృతి ఖర్బందా.. పుల్కిత్ సామ్రాట్ అనే నటుడితో ప్రేమలో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కొన్ని నెలల క్రితమే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు అధికారికంగా పోస్ట్ చేసి తెలిపింది కృతి ఖర్బందా.

ఆల్రెడీ ఈ జంట ఇటీవల జనవరిలో సీక్రెట్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే నిశ్చితార్థం చేసుకున్నట్టు సమాచారం. ఆ సమయంలో వీరి నిశ్చితార్థం ఫోటోలు కూడా లీక్ అయి వైరల్ అయ్యాయి. తాజాగా వీరి పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.

Also Read : Kajal Aggarwal : కాజల్‌కు చేదు అనుభవం.. ఓ అభిమాని సెల్ఫీ కోసం వచ్చి అక్కడ చేతులేసి..

కృతి ఖర్బందా – పుల్కిత్ సామ్రాట్ లు మార్చ్ 15న పెళ్లి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్ సమాచారం. మార్చ్ 13 నుంచి మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయని, ఢిల్లీలో కృతి – పుల్కిత్ పెళ్లి వేడుకలు జరగనున్నట్టు తెలుస్తుంది. పెళ్లి వేడుకలు మాత్రం కేవలం కుటుంబ సభ్యుల మధ్యే సెలబ్రేట్ చేసుకొని అనంతరం ముంబైలో రెసెప్షన్ వేడుక పెట్టుకొని బాలీవుడ్ సెలబ్రిటీలని ఈ జంట ఆహ్వానించనున్నట్టు సమాచారం. పెళ్లి కార్డు అంటూ ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు, పలువురు నెటిజన్లు ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు