Kajal Aggarwal : కాజల్‌కు చేదు అనుభవం.. ఓ అభిమాని సెల్ఫీ కోసం వచ్చి అక్కడ చేతులేసి..

హైదరాబాద్ లోని ఓ ఫ్యాషన్ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంది కాజల్ అగర్వాల్. కాజల్ ని చూడటానికి అనేకమంది అభిమానులు అక్కడికి వచ్చారు.

Kajal Aggarwal : కాజల్‌కు చేదు అనుభవం.. ఓ అభిమాని సెల్ఫీ కోసం వచ్చి అక్కడ చేతులేసి..

Fan Misbehaving with actress Kajal Aggarwal in a Shop Opening Event

Kajal Aggarwal : చందమామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తుంది. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ కరోనా సమయంలో పెళ్లి, ఆ తర్వాత బాబు.. ఇలా కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల మళ్ళీ తమిళ్, తెలుగు సినిమాలతో బిజీ అవుతుంది. త్వరలో సత్యభామ, ఇండియన్ 2 సినిమాలతో అభిమానులని పలకరించనుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది కాజల్. షాప్ ఓపెనింగ్స్ లో కూడా పాల్గొంటుంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ ఫ్యాషన్ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంది కాజల్ అగర్వాల్. కాజల్ ని చూడటానికి అనేకమంది అభిమానులు అక్కడికి వచ్చారు. అయితే ఈ సందర్భంలో అనుకోని ఘటన జరిగింది.

Also Read : Producer SKN : ‘అఖండ’ బాలయ్య గెటప్ లో నిర్మాత SKN.. ‘గామి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదరగొట్టేశాడుగా..

ఓ వ్యక్తి అభిమాని అంటూ సెల్ఫీ తీసుకుంటానని దగ్గరికి వచ్చి కాజల్ నడుము మీద చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో కాజల్ వెంటనే సీరియస్ అవ్వగా అక్కడ ఉన్న బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకి లాగేసారు. ఈ సంఘటనతో కాజల్ షాక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అభిమాని అని చెప్పి హీరోయిన్ తో ఇలా మిస్ బిహేవ్ చేయడమేంటి అంటూ నెటిజన్లు ఆ వ్యక్తిపై సీరియస్ అవుతున్నారు.