×
Ad

Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటిగా రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ లో (Kriti Sanon)ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్లాప్ గా నిలిచింది.

Kriti Sanon sets record as first Indian actress to attend World Health Summit- 2025

Kriti Sanon: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్లాప్ గా నిలిచింది. దీంతో, టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకోలేకపోయింది కృతి సనన్. ఇక చాలా కాలం తరువాత ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. ఈ సినిమా (Kriti Sanon)కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక అప్పటినుంచి ఈ బ్యూటీ టాలీవుడ్ కు దూరంగా ఉంటూ వస్తోంది.

Gautham Tinnanuri: కింగ్డమ్ ఎఫెక్ట్.. ‘మ్యాజిక్’ను ఎవరు పట్టించుకోవడం లేదా.. అనిరుధ్ కూడానా..

ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ కృతి సనన్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇటీవల ఆమె బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ హెల్త్‌ సమ్మిట్‌- 2025లో పాల్గొంది. అలా ఈవెంట్ కు హాజరైన తొలి భారతీయ నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది కృతి సనన్‌. ఇక ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. “ప్రస్తుతం మనం మహిళల ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. కానీ, వారి వైద్యానికి సరిపడినన్ని నిధులు ఉండటం కేటాయించడం లేదు. మహిళల ఆరోగ్యంతోపాటు.. లింగ సమానత్వం కోసం కూడా అధిక పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. మహిళల ఆరోగ్యం అనేది తేలికైన అంశం కాదు. మానవాళి భవిష్యత్తుకు మూలస్తంభం” అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె తమిళ స్టార్ ధనుష్‌ తో ‘తేరే ఇష్క్‌ మే’ అనే సినిమా చేస్తోంది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక మరి స్టార్ షాహిద్‌ కపూర్‌తో చేస్తున్న కాక్‌టెయిల్‌ 2 2026లో విడుదల కానుంది. మరి ఈ రెండు సినిమాలు ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయి అనేది చూడాలి.