Kurnool fans made Naga Chaitanya birthday even more special by providing food to orphans
Naga Chaitanya : యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య బర్త్ డే నేడు. దీంతో ఆయన ఫాన్స్, సినీ లవర్స్ అందరూ ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయన తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక నేడు ఆయన బర్త్ డే కావడంతో నాగచైతన్య 24వ సినిమాకి సంబందించిన స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తన 24వ సినిమా చెయ్యబోతున్నాడు చై.
Also Read : Vishwak Sen : ‘ఇంకా ఆ బ్యాక్ లాగ్ వుంది’.. విశ్వక్ సేన్ ఏం చదువుకున్నాడో తెలుసా..
అయితే తాజాగా తన పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. కాగా నాగ చైతన్య కర్నూల్ అభిమానులు చైతన్య బర్త్ డే సందర్బంగా అందరి హృదయాలను కదిలించే పని చేసారు. ఏంటంటే.. నాగ చైతన్య పుట్టిన రోజు సందర్బంగా తన కర్నూల్ లోని ఫ్యాన్స్ అనాధ పిల్లలకి ఫుడ్పెట్టారు. వారి మధ్యే చైతన్య బర్త్ డే కేక్ కూడా కట్ చేశారు. పిల్లలందరికీ ఫుడ్ తో పాటు కేక్స్ కూడా ఇచ్చారు. వాటికి సంబందించిన ఫోటోలను షేర్ చెయ్యగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా చాలా మంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టిన రోజు నాడు కేక్ కట్ చెయ్యడం, ఫుడ్ పెట్టడం చేస్తుంటారు. ఇక కొంత మంది అయితే బ్లడ్ కూడా డొనేట్ చేస్తుంటారు. అలా తమ అభిమాన హీరో పై తమకున్న అభిమానాన్ని తెలుపుతారు. ఇకపోతే నాగచైతన్య చేస్తున్న తండేల్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి కూడా నాగచైతన్య బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.