Kushboo Family Photo : ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్స్.. కుష్బూ ఫ్యామిలీ అంతా ఒకేసారి వెయిట్ లాస్.. ఫొటో వైరల్..

కుష్బూ ఫ్యామిలీ అంతా ఒకేసారి వెయిట్ లాస్ అయి ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్స్ అంటూ వైరల్ అవుతున్నారు.(Kushboo Family Photo)

Kushboo Family Photo

Kushboo Family Photo : ఇప్పుడు అందరూ ఫిట్నెస్ కోసం కష్టపడుతున్న వాళ్ళే. సెలబ్రిటీలు, సెలబ్రిటీ ఫ్యామిలీలు అయితే మంచి హెల్త్, బాడీ కోసం ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. తాజాగా ఒకప్పటి హీరోయిన్ కుష్బూ ఫ్యామిలీ అంతా ఒకేసారి వెయిట్ లాస్ అయి ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్స్ అంటూ వైరల్ అవుతున్నారు.(Kushboo Family Photo)

కుష్బూ, ఆమె భర్త సుందర్, ఆమె పిల్లలు అవంతిక, ఆనందిత.. అందరూ కొన్ని నెలల క్రితం లావుగా ఉండేవాళ్లు. దీంతో పలువురు బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ చేసారు. కుష్బూ పిల్లలను చూసి కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేసారు కొంతమంది. పెద్ద కూతురు హీరోయిన్ కూడా అవ్వాలని ట్రై చేస్తుందని సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు కూతుళ్లతో పాటు కుష్బూ, ఆమె భర్త సుందర్ కూడా వెయిట్ లాస్ అయ్యారు.

Also Read : Lobo : బిగ్ బాస్ ‘లోబో’కు ఏడాది జైలు శిక్ష.. ఆ కేసులో..

ఇటీవల వినాయక చవితికి కుష్బూ తన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటోలో అందరూ సన్నబడి మంచి ఫిట్నెస్ తో ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు, కుష్బూ ఫ్యాన్స్ ఆమె ఫ్యామిలీని పొగుడుతున్నారు. ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్స్, చాలా బాగా ట్రాన్స్ ఫామ్ అయ్యారు అంటూ అభినందిస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్స్ అంటే ఇలా కుష్బూ ఫ్యామిలీలా ఉండాలంటున్నారు. దీనికోసం ఈ నలుగురు జిమ్, డైట్ తో బాగా కష్టపడ్డారని తెలుస్తుంది. ఈ క్రమంలో కుష్బూ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇక కుష్బూ ప్రస్తుతం పలు సినిమాలు, టీవీ షోలు చేస్తూనే రాజకీయాల్లో బీజేపీ తరపున యాక్టివ్ గా ఉంది. ఆమె భర్త సుందర్ ఓ పక్క నటిస్తూనే వరుసగా డైరెక్టర్ గా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక కుష్బూ పెద్ద కూతురు అవంతిక సినిమాల్లోకి వస్తుందని ప్రచారం సాగుతుంది. చిన్న కూతురు ఆనందిత ప్రస్తుతం చదువుకుంటుంది.

Also Read : Arjun Chakravarthy : ‘అర్జున్ చక్రవర్తి’ మూవీ రివ్యూ.. కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ కథ..