Kushboo Sundar : భర్తతో క్యూట్ ఫోటో.. నెటిజన్స్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కుష్బూ..
పెళ్లి తర్వాత కుష్బూ రోజూ తన కూతురు పెళ్లికి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేస్తుంది. (Kushboo Sundar)
- Saketh U
- Published on- June 28, 2026 / 03:39 PM IST
Kushboo Sundar
Kushboo Sundar : తమిళ సీనియర్ నటి కుష్బూ కూతురు పెళ్లి ఇటీవలే మూడు రోజుల క్రితం గోవాలో ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి అన్ని సినీ పరిశ్రమల నుంచి చాలా మంది నటీనటులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత కుష్బూ రోజూ తన కూతురు పెళ్లికి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేస్తుంది.
తమిళ స్టార్ దర్శకుడు భాగ్యరాజా నిన్న ఉదయం మరణించారు. కుష్బూ కూతురు పెళ్ళికి కూడా ఈయన వెళ్లి సందడి చేసారు. ఈ క్రమంలో కుష్బూ తన భర్తతో కలిసి పెళ్ళిలో దిగిన ఓ క్యూట్ ఫోటోని తన సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే భాగ్యరాజా మరణించి అందరూ విషాదంలో ఉంటే ఇప్పుడు ఇలాంటి ఫోటోలు అవసరమా? భాగ్యరాజా మీకు ఫ్రెండ్ కదా, ఆ ఫ్యామిలీ మీకు క్లోజ్ కదా ఇలా హ్యాపీ ఫోటోలు షేర్ చేయడం ఎందుకు అంటూ పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
Also Read : Aamani : షూటింగ్‌లో వైన్ ట్యాంక్.. ర్యాబిట్ మాంసం.. ఆమని వ్యాఖ్యలు వైరల్..
దీంతో ఇలా ప్రశ్నించిన ఓ నెటిజన్ కి కుష్బూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కుష్బూ.. అయితే నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? కేవలం విమర్శించడానికా? నా కూతురికి పెళ్లయి ఇంకా 48 గంటలు కూడా కాలేదు. పూర్ణిమ(భాగ్యరాజ్ భార్య) గురించి మీకంటే నాకే బాగా తెలుసు కదా. మీకు ఇబ్బందిగా అనిపిస్తే, నన్ను ఫాలో అవ్వడం మానేయండి. మీలాంటి వాళ్లు లేకపోవడమే నాకు మంచిది. సంతోషంగా ఉండే హక్కు నాకు పూర్తిగా ఉంది అంటూ కామెంట్ చేసింది.
దీంతో కుష్బూ కామెంట్ వైరల్ గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు కుష్బూకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే పలువురు కుష్బూపై విమర్శలు చేస్తున్నారు.
