సైఫ్ అలీ ఖాన్, జోయా హుస్సేన్ ప్రధాన పాత్రధారులుగా.. నవదీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న’లాల్ కాప్టాన్’ అక్టోబర్ 18న విడుదల..
సైఫ్ అలీ ఖాన్, జోయా హుస్సేన్ ప్రధాన పాత్రధారులుగా.. ‘NH 10’ ఫేమ్ నవదీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘లాల్ కాప్టాన్’.. (చాప్టర్ 1 – ది హంట్).. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. సునీల్ లుల్లా, ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నారు. నాగసాధు ప్రతీకార నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
రీసెంట్‌గా ‘లాల్ కాప్టాన్’.. (చాప్టర్ 1 – ది హంట్).. ట్రైలర్ రిలీజ్ చేశారు. మానవ్ విజ్, దీపక్ దోబ్రియాల్, సిమోన్ సింగ్, సౌరభ్ సచ్‌దేవ కీలక పాత్రల్లో నటించారు. ‘లాల్ కాప్టాన్’ మూవీని అక్టోబర్ 18న విడుదల చెయ్యనున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.
Read Also : అల వైకుంఠపురములో – ప్రమోషనల్ సాంగ్..
పోస్టర్‌లో సైఫ్ అలీ ఖాన్ ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’లో జానీ డెప్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. రచన : దీపక్ వెంకటేశా, నవదీప్ సింగ్, డైలాగ్స్ : సుదీప్ శర్మ, మ్యూజిక్ : సమీరా కొప్పికర్, సినిమాటోగ్రఫీ : శంకర్ రామన్, ఎడిటింగ్ : జబీన్ మర్చంట్, ప్రొడక్షన్ డిజైనర్ : రాకేష్ యాదవ్.