Laggam Time : ‘లగ్గం టైమ్’ పూర్తయింది.. సమ్మర్లోనే రిలీజ్..

ఇప్పటికే లగ్గం టైమ్‌ సినిమా నుంచి చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, ఓ సాంగ్ ని రిలీజ్ చేసారు.

Laggam Time Movie Shooting Completed on Ugadi

Laggam Time : 20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై కె.హిమ బిందు నిర్మాణంలో ప్రజోత్ కె వెన్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లగ్గం టైమ్’. రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Klin Kaara : ఉగాది పూజ చేస్తున్న చరణ్ కూతురు క్లిన్ కారా.. అమ్మ, నానమ్మతో కలిసి.. ఫొటోలు వైరల్..

ఇప్పటికే లగ్గం టైమ్‌ సినిమా నుంచి చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, ఓ సాంగ్ ని రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది అని అధికారికంగా మూవీ యూనిట్ ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి త్వరలోనే సినిమా రిలీజ్ ప్లాన్ చేయనున్నారు.

ఈ సందర్భంగా మూవీ యూనిట్ మాట్లాడుతూ.. లగ్గం టైమ్ లో యూత్ ను మాత్రమే కాదు టైటిల్ కి తగ్గట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే టీజర్ ను విడుదల చేస్తాం. సమ్మర్ లోనే ‘లగ్గం టైమ్’ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.