లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ మరోసారి ఏపీలో బ్రేక్ పడింది. విడుదలపై ఏపీ హైకోర్టు విచారణ చేసింది. కేసు సుప్రీంకోర్టులో ఉందని.. ఇప్పుడు సినిమా చూసి నిర్ణయం తీసుకోలేమని బెంచ్ స్పష్టం చేసింది. విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు సినిమా ప్రివ్యూ కూడా చూడలేమని, ఇదే సినిమాలో సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉన్నందున తీర్పు చెప్పలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇది కల్పిత కథ కాదని, వాస్తవం అంటూ మూవీ తరపు లాయర్లు వాదన వినిపించారు. నిర్మాత ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదన్నారు. రాజకీయ కక్షలు, కుట్రలతోనే ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు లాయర్లు. ఏపీ ప్రజలు ఎందుకు సినిమా చూడకూడదని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ఈ సినిమా చూస్తే.. సీఎం చంద్రబాబు నైజం ఏంటో ప్రజలందరికీ తెలుస్తుందని భయపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబు సినిమా కాదని.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర అన్నారు న్యాయవాదులు.