లక్ష్మీస్ NTR : చంద్రబాబుతో చెడుగుడు.. కన్నీళ్లు

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్..

  • Publish Date - February 14, 2019 / 04:40 AM IST

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్..

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ.. లక్ష్మీ’S ఎన్టీఆర్.. అసలు కథ.. ఇది కుటంబ కుట్రల చిత్రం అంటూ, లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ జీవితాన్ని చూపించబోతున్నానని, వెన్నుపోటు అంశం హైలెట్ అవుతుందని వర్మ మొదటినుండి చెప్తూనే ఉన్నాడు.. ఇప్పటికే వెన్నుపోటు, ఎందుకు అనే రెండు పాటలు, షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్స్, ఆర్టిస్ట్‌ల ఫోటోలతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ లేపుతున్నాడు.. పదవులు పోయినా, అయినవారు వద్దన్నా లక్ష్మీ పార్వతి చెయ్యి వదలని ఎన్టీఆర్ ప్రేమకథ ఇది.. అందుకే ప్రేమికుల రోజున ట్రైలర్ రిలీజ్ చేస్తా అని చెప్పిన వర్మ, మాట మీద నిలబడుతూ.. ఈ ఉదయం 9 గంటల 27 నిమిషాలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ వదిలాడు.. నమ్మితేనే కదా ద్రోహం చేసేది.. అనే అడవి రాముడు సినిమాలో డైలాగ్ టెక్స్ట్‌తో ట్రైలర్ మొదలైంది..

1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓడిపోయిన రోజుల్లో, తన జీవిత కథ రాస్తానని, ఎన్టీఆర్ దగ్గరకు లక్ష్మీ పార్వతి రావడం, ఆయనకి తోడుగా ఉంటూ సపరిచర్యలు చెయ్యడం, ఎన్టీఆర్ పిల్లలు లక్ష్మీ పార్వతిని కొట్టడం, మీరు నా పిల్లలై ఉండీ, వాడితో చేరారా.. సిగ్గులేకుండా.. అంటూ ఎన్టీఆర్, పిల్లలపై కోప్పడడం, లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం, హోటల్ వైశ్రాయ్ సంఘటన, నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు.. వాడిని నేను నమ్మడం అంటూ.. ఎన్టీఆర్ బాధ పడడంతో ట్రైలర్ ఎండ్ అవుతుంది.

 

ట్రైలర్ మొత్తం చంద్రబాబునే టార్గెట్ చేసాడు వర్మ.. కళ్యాణీ మాలిక్ బ్యాగ్రౌండ్ స్కోర్, రామీ కెమెరా వర్క్ బాగున్నాయి.. డైరెక్టర్‌గా తన పేరుతో పాటు, అగస్త్య మంజు పేరు కూడా వేసాడు వర్మ.. లక్ష్మీ’S ఎన్టీఆర్ ట్రైలర్‌పై, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..

వాచ్ ట్రైలర్…