మహానాయకుడు థియేటర్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

వర్మ ధైర్యం- మహానాయకుడు థియేటర్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్..

  • Publish Date - February 12, 2019 / 12:48 PM IST

వర్మ ధైర్యం- మహానాయకుడు థియేటర్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్..

బాలయ్య నటిస్తూ, నిర్మించిన ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. ఫిబ్రవరి 22 న మహానాయకుడు రిలీజవనుంది. మరోవైపు కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ..లక్ష్మీస్ ఎన్టీఆర్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌‌తో, సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తున్నాడు. నిన్ననే బొమ్మాళీ రవిశంకర్ పాట పాడుతున్న వీడియో షేర్ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడింకో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే.. ఎన్టీఆర్ మహానాకుడుతో పాటు, లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నా అని ప్రకటించాడు. ఫిబ్రవరి 14 న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం పెట్టేసాడు. థియేట్రికల్ ట్రైలర్‌ని ఫిబ్రవరి 22 న రిలీజ్ చేస్తాడట.. అదికూడా ఎన్టీఆర్ మహానాకుడు సినిమాతో పాటు కావడం విశేషం..

ఎన్టీఆర్ మహానాకుడు సినిమా చూడ్డానికి వచ్చేవాళ్ళు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూడొచ్చు.. అని పోస్ట్ చేసాడు. డిసెంబర్‌లో, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఆడియో, ట్రైలర్ రిలీజ్ టైమ్‌కి, లక్ష్మీస్ ఎన్టీఆర్ నుండి వెన్నుపోటు సాంగ్ రిలీజ్ చేసాడు. ఇప్పుడు ఏకంగా మహానాయకుడుతో పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేస్తున్నాడు.. నిజంగా వర్మ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే…

 

 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం